Telangana Cabinet Decisions live: తెలంగాణ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే

దాదాపు నాలుగు నెలల తరువాత సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం అనేక కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది.

news18-telugu
Updated: June 18, 2019, 8:54 PM IST
Telangana Cabinet Decisions live: తెలంగాణ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే
కేసీఆర్ (File)
  • Share this:
కొన్ని నెలల తరువాత సమావేశమైన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఐదు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. లోక్ సభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేసుకున్న అనేక అంశాలకు తెలంగాణ కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

కేబినేట్ నిర్ణయాలివే...

పొరుగు రాష్ట్రాల సహకారంతో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం....సీఎం కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ, మహారాష్ట్ర సీఎంలను ఆహ్వానించాం....సీఎం కేసీఆర్ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సన్నిహిత సంబంధాలతో ముందుకు సాగుతున్నాం....సీఎం కేసీఆర్

నూతన సెక్రటేరియట్, నూతన అసెంబ్లీ భవనాల, నూతన విధాన సౌధ నిర్మాణానికి కేబినేట్ నిర్ణయం

పార్లమెంటు భవనం తరహాలో ఎర్రమంజిల్ ప్రాంతంలో నూతన అసెంబ్లీ, కౌన్సిల్ భవనాల నిర్మాణంఈ నెల 27న నూతన అసెంబ్లీ, కౌన్సిల్ భవనాల నిర్మాణం...

ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ పెంపుపై ఉద్యోగ సంఘాలతో చర్చలు...రిటైర్మెంట్ వయస్సు పెంపుపై కూడా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తాం...సీఎం కేసీఆర్...

నూతన మున్సిపల్ చట్టంపై కేబినేట్లో చర్చ...

మోకిలా ప్రాంతంలో ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ కు సినిమా స్టూడియో నిర్మాణానికి 5 ఎకరాల కేటాయింపు... శారదాపీఠానికి 2 ఎకరాల కేటాయింపు...

టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల నిర్మాణానికి 31 జిల్లాల్లో భూముల కేటాయింపు

First published: June 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు