పింఛన్ల పెంపు అమలు.. తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం..

పెంచిన పెన్షన్‌ను 2019 జూన్ నుంచే అమలు చేయనున్నారు. జూన్‌కు సంబంధించిన పెన్షన్‌ను జూలైలో లబ్ధిదారులకు అందజేస్తారు. 20న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లబ్దిదారులకు పెంచిన పెన్షన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ అందిస్తారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 17, 2019, 9:51 PM IST
పింఛన్ల పెంపు అమలు.. తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం..
కేసీఆర్ (File)
  • Share this:
పింఛన్ల పెంపు అమలుకు తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధిత ప్రొసీడింగ్స్‌ను ఈ నెల 20న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయించింది. బుధవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 5 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో.. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధి గ్రస్తులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.2,016కు పెంచాలని నిర్ణయించారు. దివ్యాంగులు, వృద్ధ కళాకారుల పెన్షన్ ను రూ.1500 నుంచి రూ.3,016కు పెంచాలని నిర్ణయించారు. పెంచిన పెన్షన్‌ను 2019 జూన్ నుంచే అమలు చేయనున్నారు. జూన్‌కు సంబంధించిన పెన్షన్‌ను జూలైలో లబ్ధిదారులకు అందజేస్తారు. 20న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లబ్దిదారులకు పెంచిన పెన్షన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ అందిస్తారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు పాల్గొంటారు. ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం ముగిసిన వెంటనే లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు.

ఇక, వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయో పరిమితిని 65 సంవత్సరాల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామన్న టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీని అమలు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. 57 ఏళ్లు నిండిన నిండిన పేద వృద్ధుల జాబితాను వెంటనే రూపొందించాలని అధికారులను మంత్రి వర్గం ఆదేశించింది. వీలైనంత త్వరలో లబ్ధిదారుల జాబితా రూపొందించి, దాని ప్రకారం పెంచిన పెన్షన్ అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ తేదీని తొలగించాలని నిర్ణయించింది. బుధవారం (17-07-2019) నాటి వరకు కూడా పీఎఫ్ ఖాతా ఉన్న కార్మికులకు పింఛను అందించాలని అధికారులను మంత్రి వర్గం ఆదేశించింది.

మరోవైపు, కొత్త మునిసిపల్ బిల్లుకు సంబంధించిన ముసాయిదాను మంత్రివర్గం ఆమోదించింది. గురువారం ఈ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశ పెడతారు. అసెంబ్లీలో, శాసనమండలిలో బిల్లుపై చర్చ జరుగుతుంది.

First published: July 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>