రైతులకు రూ.లక్ష రుణమాఫీ.. ఒక కండిషన్ పెట్టిన సీఎం కేసీఆర్

Telangana Assembly Budged Live Updates | 2018 డిసెంబర్ 11లోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు రూ.లక్ష వరకు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.

Ashok Kumar Bonepalli | news18-telugu
Updated: February 22, 2019, 1:53 PM IST
రైతులకు రూ.లక్ష రుణమాఫీ.. ఒక కండిషన్ పెట్టిన సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతున్న కేసీఆర్ (File)
  • Share this:
తెలంగాణలో రైతులకు మరోసారి పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు పంట రుణాలు మాఫీచేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సదర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రైతులకు పంటరుణాలు మాఫీ చేస్తున్నట్టు సభలో ప్రకటించారు. 2018 డిసెంబర్ 11లోపు పంట రుణాలు తీసుకున్న వారికి మాఫీ చేయనున్నారు. అయితే, మొత్తం కాకుండా రూ.లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేయనున్నారు. రైతు రుణమాఫీ కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.6000 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రూ.లక్ష వరకు రుణాలను మాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.

డిసెంబర్ 11 డెడ్ లైన్ ఎందుకు పెట్టారు?

2018 డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పాటైంది. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన డిసెంబర్ 11వ తేదీలోపు రుణాలు తీసుకున్నవారికి రుణమాఫీలు ఇస్తామని ప్రకటించారు.
First published: February 22, 2019, 1:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading