Home /News /politics /

TELANGANA BJP UNHAPPY WITH NATIONAL LEADERS AND THE WAY THEY DEAL WITH TRS AND KCR AK

Telangana BJP: కేంద్రమంత్రిపై తెలంగాణ బీజేపీ అసహనం.. ఇలా చేస్తే ఎలా అంటూ..

బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

Telangana BJP: ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌తో సమావేశమయ్యారు.

    తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సంఖ్యాపరంగా బీజేపీకి తెలంగాణలో సీట్ల సంఖ్య తక్కువే అయినా.. కొంతకాలంగా ఆ పార్టీ రాజకీయంగా పుంజుకుందన్నది వాస్తవం. దీనికి తోడు పార్టీ ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణలో బీజేపీ బలోపేతానికి తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో నిత్యం సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఈ పాదయాత్రలో పలువురు ఇతర రాష్ట్రాల బీజేపీ నేతలు, జాతీయ స్థాయి నేతలు పాల్గొని బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇదే సమయంలో కొందరు బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ బీజేపీకి అంతగా మింగుడు పడటం లేదనే చర్చ జరుగుతోంది.

    ఓ వైపు తెలంగాణ బీజేపీ, సీఎం కేసీఆర్‌పై రాజకీయ పోరాటం చేస్తుంటే.. ఆయన ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. ఈరకంగా కేంద్రంతో తమకు సఖ్యత ఉందనే సంకేతాలను పరోక్షంగా ఇచ్చారు. దీంతో తెలంగాణ బీజేపీ నేతలకు సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్‌ కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. సీఎం కేసీఆర్ బీజేపీ శ్రేణుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేందుకే ఈ రకంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు.

    అయితే ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కేసీఆర్, కేటీఆర్‌తో కలిసి భోజనం కూడా చేశారని వార్తలు వచ్చాయి. దీనిపై తెలంగాణ బీజేపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోందని తెలుస్తోంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోకుండా కేంద్రమంత్రులు ఇలా చేయడం ఏమిటని కొందరు బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

    Sleep: నగ్నంగా పడుకోవడం వల్ల ఎన్నో లాభాలు.. చాలా సమస్యలకు పరిష్కారం.. అవేంటో తెలుసుకోండి

    Revanth Reddy: కాంగ్రెస్ ముఖ్యనేత కీలక వ్యాఖ్యలు.. రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్

    ఓ వైపు తాము తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయమని చెబుతుంటే.. కేంద్రమంత్రులు రాష్ట్రానికి వచ్చి ఈ రకంగా వ్యవహరిస్తే ఎలా అని మదనపడుతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలనే యోచనలో తెలంగాణ బీజేపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించాలని భావిస్తున్న బీజేపీ నేతలు సొంత పార్టీపైనే అసహనం వ్యక్తం చేస్తున్నారనే టాక్ ఆసక్తిరేపుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, CM KCR, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు