తెలంగాణ బీజేపీలోకి బాహుబలి వస్తారట.. మరి ఎవరా నేత?

Operation Lotus in Telangana: బీజేపీలోకి చేరికలు ట్రైలర్ మాత్రమేనని, అసలు మల్టీ కలర్ సినిమా ముందుందని ఆ పార్టీ లక్ష్మణ్ అంటున్నారు. రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పార్టీలో చేరతారని చెప్పారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 18, 2019, 8:07 AM IST
తెలంగాణ బీజేపీలోకి బాహుబలి వస్తారట.. మరి ఎవరా నేత?
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 18, 2019, 8:07 AM IST
పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటును గెలుచుకొన్న ఆ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా నాలుగు లోక్ సభ సీట్లను గెలుచుకొంది. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నయం తమ పార్టీయేనని కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు. తాజాగా ఆ పార్టీలోకి ఇతర పార్టీల నేతల చేరికలు కూడా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో చేరికలు ట్రైలర్ మాత్రమేనని, అసలు మల్టీ కలర్ సినిమా ముందుందని ఆ పార్టీ లక్ష్మణ్ అంటున్నారు. రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పార్టీలో చేరతారని చెప్పారు. జూలై 6 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభం కాబోతోందని, ఆ సందర్భంగా చేరికలు ఉధృతమవుతాయని అన్నారు. కనీసం 5 లక్షల సభ్యత్వాలను అదనంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశాకే మీ పార్టీలోకి తీసుకుంటారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. నిబంధనలకు సాంకేతికత, నైతికత అడ్డుగా ఉండవన్నారు. అవసరమైతే రాజీనామా చేస్తారు.. లేదా నిబంధనలకు లోబడి చేరుతారు అని పేర్కొన్నారు.

కాగా, మున్ముందు చాలా మంది బాహుబలులు బీజేపీలో చేరతారని లక్ష్మణ్ చెప్పారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు దృష్టి సారించారు. బాహుబలులు ఉండరని, బాహుబలి ఒక్కడేనని.. ఆయన ఎవరని చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ నుంచి వస్తారా? లేక కాంగ్రెస్ నుంచి వస్తారా? అని విశ్లేషిస్తున్నారు.

First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...