ఆర్టీసీ సమ్మెపై రంగంలోకి కేంద్రం.. కేసీఆర్‌తో మాట్లాడనున్న గడ్కరీ

త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానని, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, అధికారులను ఢిల్లీకి పిలిపించి సమావేశం నిర్వహిస్తానని హామీ ఇచచినట్లు వెల్లడించారు.

news18-telugu
Updated: November 21, 2019, 3:33 PM IST
ఆర్టీసీ సమ్మెపై రంగంలోకి కేంద్రం.. కేసీఆర్‌తో మాట్లాడనున్న గడ్కరీ
కేసీఆర్, గడ్కరీ
  • Share this:
తెలంగాణలో 47 రోజుల తర్వాత ఆర్టీసీ సమ్మెకు బ్రేకులు పడ్డాయి. బేషరతుగా తమను విధుల్లోకి తీసుకుంటే సమ్మెను విరమిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో నెలకొన్న పరస్థితులను బీజేపీ ఎంపీలు కేంద్రానికి వివరించారు. కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్, సోయం బాపూరావు.. ఢిల్లీలో కేంద్ర రవాణాశాఖ నితిన్ గడ్కరీని కలిసి ఆర్టీసీ సమ్మెపై మాట్లాడారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వివరించారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. ఆర్టీసీ అంశంలో జోక్యం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిని పక్కనబెట్టి.. బేషరతుగా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి కనీస డిమాండ్లను నెరవేర్చి.. ఉద్యోగ భద్రత కల్పించాలని స్పష్టం చేశారు. ఇక తమ విజ్ఞప్తిపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు కిషన్ రెడ్డి. త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానని, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, అధికారులను ఢిల్లీకి పిలిపించి సమావేశం నిర్వహిస్తానని హామీ ఇచచినట్లు వెల్లడించారు.


First published: November 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>