మోదీ కేబినెట్‌లో కిషన్ రెడ్డికి చోటు... శాఖపై సస్పెన్స్

Kishan reddy in Modi cabinet | తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపీగా విజయం సాధించిన కిషన్ రెడ్డికి ఈసారి మోదీ కేబినెట్‌లో చోటు దక్కడం ఖాయమైంది.

news18-telugu
Updated: May 30, 2019, 2:15 PM IST
మోదీ కేబినెట్‌లో కిషన్ రెడ్డికి చోటు... శాఖపై సస్పెన్స్
కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ నుంచి ఈసారి నరేంద్రమోదీ కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కుతుందనే అంశానికి తెరపడింది. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపీగా విజయం సాధించిన కిషన్ రెడ్డికి ఈసారి మోదీ కేబినెట్‌లో చోటు దక్కడం ఖాయమైంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కిషన్ రెడ్డికి ఫోన్ వచ్చింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా కిషన్ రెడ్డికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పినట్టు తెలుస్తోంది. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోయే నరేంద్రమోదీ సైతం కిషన్ రెడ్డికి ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేశారని సమాచారం.

తెలంగాణ నుంచి ఈసారి బీజేపీ తరపున నలుగురు ఎంపీలు విజయం సాధించడంతో... కేంద్ర కేబినెట్‌లో రాష్ట్రానికి మంచి ప్రాధాన్యత దక్కుతుందని వార్తలు వచ్చాయి. సికింద్రాబాద్ నుంచి గెలిచిన కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి గెలిచిన ధర్మపురి అరవింద్‌కు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ దఫా కిషన్ రెడ్డికి మాతమ్రే చోటు దక్కనుందని తెలుస్తోంది. అయితే కిషన్ రెడ్డికి కేబినెట్ ర్యాంకు పదవి దక్కుతుందా లేక సహాయ మంత్రి పదవి దక్కుతుందా అని బీజేపీ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

First published: May 30, 2019, 2:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading