సచివాలయం ముందు సెల్ఫీ దిగిన బీజేపీ ఎమ్మెల్సీ... కారణం ఇదే ?

తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని విపక్షాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా... ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఏ మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితులు కనిపించడం లేదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: July 12, 2019, 2:53 PM IST
సచివాలయం ముందు సెల్ఫీ దిగిన బీజేపీ ఎమ్మెల్సీ... కారణం ఇదే ?
తెలంగాణ సచివాలయం ముందు సెల్పీ తీసుకుంటున్న బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు
  • Share this:
తెలంగాణ సచివాలయాన్ని కూల్చి అదే స్థానంలో నూతన సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే భూమి పూజ కూడా చేశారు. నూతన సచివాలయంతో పాటు ఎర్రమంజిల్‌లో కొత్త అసెంబ్లీని కూడా నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని విపక్షాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా... ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఏ మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితులు కనిపించడం లేదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సచివాలయంలో సెల్ఫీ దిగారు బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు. తన అనుచరులతో కలిసి సచివాలయాన్ని సందర్శించిన బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు... సచివాలయం జ్ఞాపకాలు చెరిగిపోకుండా ఉండేందుకు ఈ సెల్ఫీ దిగినట్టు తెలుస్తోంది.


First published: July 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు