నన్ను పట్టించుకోరా... బండి సంజయ్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి

ఎమ్మెల్యే రాజాసింగ్(ఫైల్ ఫోటో)

రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన సూచనలను పరిగణనలోకి తీసుకోలేదని ఆయన నేరుగా బండి సంజయ్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేశారు.

 • Share this:
  తెలంగాణ బీజేపీ కొత్త కమిటీ కూర్పుపై అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. ఈ అంశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీరుపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన సూచనలను పరిగణనలోకి తీసుకోలేదని ఆయన నేరుగా బండి సంజయ్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేశారు. తాను సూచించిన ఏ ఒక్కరికీ కమిటీలో చోటు ఇవ్వకపోవడంపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. గ్రూప్ రాజకీయాలు పక్కనపెట్టి...పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి సూచించారు.

  అంతకుముందు బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతక కమిటీని ప్రకటించింది. 23 మందితో కూడిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటిని బండి సంజయ్ ప్రకటించారు. 8 మంది ఉపాధ్యక్షులు, మరో 8 మంది కార్యదర్శులు, నలుగురు ప్రధాన కార్యదర్శులకు కమిటీలో చోటు కల్పించింది. కొత్తగా కమిటీలో ఉపాధ్యక్షులుగా విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌ రావు, యెండల లక్ష్మినారాయణ, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, బండారు శోభారాణి ఉన్నారు.

  Telangana bjp news, raja singh news, bandi sanjay news, telangana bjp new committee, telangana news, తెలంగాణ బీజేపీ వార్తలు, రాజా సింగ్ న్యూస్, బండి సంజయ్ న్యూస్, తెలంగాణ బీజేపీ కొత్త కమిటీ, తెలంగాణ న్యూస్
  బండి సంజయ్(ఫైల్ ఫోటో)


  ఇక ప్రధాన కార్యదర్శులుగా ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌, బండారు శృతి, మంత్రి శ్రీనివాసులుని నియమించారు. కార్యదర్శులుగా రఘునందన్‌రావు, ప్రకాశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, బొమ్మ జయశ్రీ, పల్లె గంగారెడ్డి, కుంజా సత్యవతి, మాధవి, ఉమారాణిలను నియమించారు. అధికార ప్రతినిధులుగా కృష్ణ సాగర్ రావు, రజిని కుమారి రాకేష్ రెడ్డిలను నియమించారు. ట్రెజరర్‌గా బండారి శాంతికుమార్‌, బవర్లాల్‌ వర్మ, ఆఫీస్‌ సెక్రటరీగా ఉమా శంకర్‌లను నియమించారు.
  Published by:Kishore Akkaladevi
  First published: