హోమ్ /వార్తలు /National రాజకీయం /

Telangana: రాజీనామా చేయాలని ఒత్తిడి.. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Telangana: రాజీనామా చేయాలని ఒత్తిడి.. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

MLA Rajasingh: తాను రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారని రాజాసింగ్ అన్నారు.

  తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒకరైన గోషామహల్ శాసనసభ్యులు రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. గోషామహల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి జరుగుతుందనే ప్రచారం జరుగుతోందని.. తాను రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారని రాజాసింగ్ అన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిధులు ప్రకటించిన వెంటనే తాను పదవికి రాజీనామా సమర్పిస్తానని రాజాసింగ్ తెలిపారు. గోషామహాల్‌ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవిని వదులుకోవడానాకి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

  ఎన్నికలు వస్తే తప్ప సీఎం కేసీఆర్ నిధులు కేటాయించడం లేదని రాజాసింగ్ మండిపడ్డారు. ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా, గోషామహాల్‌ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సైతం పది లక్షలు ఇవ్వాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అలా చేస్తే వెంటనే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పత్రాన్ని సమర్పిస్తానని రాజాసింగ్ అన్నారు.

  raja singh, bjp mla raja singh movie, sambhaji, sambhaji history, chatrapati shivaji, shivaji son sambhaji, telangana, rajasingh sambhaji movie, bjp telangana, telugu cinema news, రాజాసింగ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, రాజాసింగ్ శంభాజీ మూవీ, శంభాజీ జీవితగాధ, శివాజీ
  రాజాసింగ్ (ఫైల్ ఫోటో)

  హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తరువాత ఆ నియోజవకర్గానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న సీఎం కేసీఆర్.. వేల కోట్ల ఖర్చు చేసి చేపట్టిన దళితబంధు పథకాన్ని కూడా అక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో మిగతా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కొందరు తమ నియోజకవర్గాల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం తన నియోజకవర్గానికి రూ. 2 వేల కోట్లు కేటాయిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. తాజాగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం ఇదే రకమైన వ్యాఖ్యలు చేయడం విశేషం.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Bjp, Raja Singh, Telangana

  ఉత్తమ కథలు