• Home
 • »
 • News
 • »
 • politics
 • »
 • TELANGANA BJP MLA RAGHUNANDAN RAO FIRES ON TRS CONGRESS AND CM KCR AK

Telangana: రోజా ఇంటికి వెళ్లారు... కాంగ్రెస్‌ నేతలకు అందుకే అపాయింట్‌మెంట్ అన్న బీజేపీ ఎమ్మెల్యే

రఘునందన్ రావు (ఫైల్ ఫోటో)

Telangana: టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ బీ టీమ్ కాబట్టే.. హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా వారికి అపాయింట్’మెంట్ వచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.

 • Share this:
  హుజూరాబాద్‌లో అభివృద్ధి జరగలేదన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖండించారు. ఒక్క డబల్ బెడ్ రూమ్ కట్టలేదు అంటే దానికి కారణం ఈటల రాజేందరా లేక ప్రభుత్వమా అని మండిపడ్డారు. ఈటల రాజేందర్ సీఎంకి లేఖ రాశారని ఫేక్ లెటర్ సృష్టించారని మండిపడ్డారు. గజ్వేల్,సిద్దిపేట, సిరిసిల్లకు ఇచ్చినట్టు నిధులు ఇతర నియోజక వర్గాలకు ఇవ్వలేదని బాల్క సుమన్ ఒప్పుకున్నారని రఘునందన్ రావు అన్నారు. బాల్క సుమన్ బానిస సుమన్ అని విమర్శించారు. తెలంగాణ రావడానికి బీజేపీ కూడా కారణమని వ్యాఖ్యానించారు. అభివృద్ధి మీద,ఆత్మ గౌరవం మీద చర్చకు తాము సిద్ధమని రఘునందన్ రావు అన్నరు. ఆంధ్ర నుండి వచ్చిన వారి కాళ్లకు ముళ్ళు కుచ్చుకుంటే పంటితో తీస్తానని గతంలో కేసీఆర్ అన్నారని.. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్ళి భోజనం చేసిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు.

  రాయలసీమను రతనాల సీమ చేస్తా అని గతంలో కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మంత్రులు ఏపీ ప్రజలపై మరో రకంగా మాట్లాడుతున్నారని రఘునందన్ రావు అన్నారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు లేవని.. అందుకే ఏపీ ప్రజల ఓట్లు అవసరం లేదని రఘునందన్ రావు అన్నారు. మరోసారి సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తోందని ఆరోపించారు. కేటీఆర్ వెంట ఉన్నవారు ఎవరని ప్రశ్నించారు. టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ బీ టీమ్ కాబట్టే.. హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా వారికి అపాయింట్’మెంట్ వచ్చిందని అన్నారు. కాంగ్రెస్‌ను ప్రగతి భవన్‌లో తాకట్టు పెట్టేందుకే కాంగ్రెస్ నేతలు వెళుతున్నారని రఘునందన్ రావు విమర్శించారు.
  Published by:Kishore Akkaladevi
  First published: