Home /News /politics /

TELANGANA BJP LEADERS HAPPY WITH CM KCR DELHI TOUR THIS TIME DUE TO THIS PARTICULAR REASON AK

Telangana: KCR ఢిల్లీ టూర్‌పై తెలంగాణ బీజేపీ ఫుల్ హ్యాపీ.. అసలు కారణం ఏమిటంటే..

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్‌ ఈసారి ఢిల్లీలో ప్రధాని లేదా కేంద్ర హోంమంత్రి వంటి వారిని కలవకపోవడం పట్ల తెలంగాణ బీజేపీ హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.

    వరి కొనుగోళ్ల విషయంలో ప్రధాని, ఇతర కేంద్రమంత్రులతో మాట్లాడేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నట్టు ఆయన హస్తిన బాట పట్టడానికి ముందు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. గత ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ నాలుగు రోజులు అక్కడ ఇంట్లోనే ఉన్నారు. ఆయన తన పర్యటనలో ఎవరినీ కలవలేదు. మంగళవారం సాయంత్రం మంత్రి కేటీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ బృందం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్‌తో పాటు పీయూష్ గోయల్‌తో సమావేశమైంది. అయితే సీఎం కేసీఆర్ మాత్రం ఈసారి తన ఢిల్లీ పర్యటనలో ఎవరినీ కలవలేదు. ఢిల్లీలో సీఎం కేసీఆర్‌కు ప్రధాని, ఇతర ముఖ్యనేతల అపాయింట్‌మెంట్ లభించలేదనే చర్చ జరుగుతోంది. అమితు ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి ఆరోగ్యం బాగాలేక ఢిల్లిలోని ఎయిమ్స్‌లో చికిత్స చేయించుకుంటున్నారని.. ఈ కారణంగానే ఆయన ఇన్ని రోజులు ఢిల్లీలో ఉన్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

    అయితే సీఎం కేసీఆర్‌ ఈసారి ఢిల్లీలో ప్రధాని లేదా కేంద్ర హోంమంత్రి వంటి వారిని కలవకపోవడం పట్ల తెలంగాణ బీజేపీ హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. తెలంగాణలో తాము అధికార టీఆర్ఎస్‌తో పోరాడుతుంటే.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఢిల్లీలోని ప్రధాని, హోంమంత్రి, ఇతర కేంద్రమంత్రులను కలిసి చర్చలు జరుపుతున్నారనే అసంతృప్తి ఆ పార్టీ నేతల్లో కనిపించేది. ఢిల్లీలో అధికారికంగా ప్రధాని, హోంమంత్రిని కలిసే టీఆర్ఎస్.. తమకు హస్తినలో బీజేపీతో సఖ్యత ఉందన్నట్టుగా వ్యవహరిస్తోందని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తూ వచ్చారు.

    ఈ క్రమంలో మరోసారి కేసీఆర్ ఢిల్లీ పెద్దలను కలిస్తే.. అలాంటి సంకేతాలే వస్తాయని వాళ్లు అనుకున్నారు. అంతేకాదు ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసి.. వారంతా తెలంగాణ పథకాలను,ప్రగతిని పొగుడుతున్నారని టీఆర్ఎస్ నేతలు చెప్పడం స్థానిక బీజేపీ నేతలకు ఇబ్బందిగా మారింది. ఇదే అంశాన్ని ఇక్కడి బీజేపీ నేతలు పలుసార్లు ఢిల్లీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు వార్తలు వచ్చాయి. ఈ రకంగా వ్యవహరించవద్దని రాష్ట్ర బీజేపీ నేతలు పార్టీ జాతీయ నేతలకు చెప్పినట్టు సమాచారం.

    Walking: వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు.. అదే సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి

    కీలక పదవి ఆ ముగ్గురిలో ఎవరికి ? KCR మనసులో ఉన్నదెవరు..? ట్విస్ట్ ఉంటుందా ?

    తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌పై బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో.. మరోసారి కేసీఆర్ ఢిల్లీలో ప్రధాని మోదీ సహా పలువురు కేంద్రమంత్రులను కలిస్తే రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయని బీజేపీ నేతలు భావించినట్టు చర్చ జరిగింది. అయితే ఈ కారణంగానా లేక మరే ఇతర కారణమో తెలియదు కానీ.. ఈసారి సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ లేదా అమిత్ షాను కలవలేకపోయారు. కారణం ఏదైనా.. తన ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ పెద్దలెవరినీ కలవకపోవడం తెలంగాణ బీజేపీ నేతలకు సంతోషం కలిగిస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు