• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELANGANA BJP LEADER VIJAYASHANTHI DEMANDS TO PAY RS 75 THOUSAND ARREARS AS UNEMPLOYMENT ALLOWANCE BA

Vijayashanthi: ముందు పాత బాకీ తీర్చండి.. ఆ తర్వాత ముచ్చట్లు.. కేటీఆర్‌పై విజయశాంతి ఫైర్

Vijayashanthi: ముందు పాత బాకీ తీర్చండి.. ఆ తర్వాత ముచ్చట్లు.. కేటీఆర్‌పై విజయశాంతి ఫైర్

విజయశాంతి (ఫైల్ ఫోటో)

‘మంత్రి కేటీఆర్ నిరుద్యోగ భృతిపై ప్రకటన చేశారు. నిరుద్యోగులకిచ్చిన హామీ ప్రకారం ఇప్పటికే ఒకొక్కరికీ సుమారుగా రూ.75 వేలు ఈ ప్రభుత్వం బాకీ ఉన్నట్టు తేలింది. మొదట దానిని చెల్లించి, తర్వాత మిగతా ముచ్చట్లు చెబితే మంచిది.’ అని విజయశాంతి అన్నారు.

  • Share this:
    తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేత, సినీ నటి విజయశాంతి మండిపడ్డారు. నిరుద్యోగ భృతిపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ‘నిరుద్యోగుల భృతి పై ఈ రోజు మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ త్వరలో స్పష్టత వస్తుందని తెలియజేశారు. ముఖ్యమంత్రి లేదా ఆర్థికమంత్రి ప్రకటించకపోయినా... ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వ పరిస్థితుల దృష్ట్యా ఆ ప్రకటనకు విలువ ఉంటుంది. అయితే, నిరుద్యోగులకిచ్చిన హామీ ప్రకారం ఇప్పటికే ఒకొక్కరికీ సుమారుగా రూ.75 వేలు ఈ ప్రభుత్వం బాకీ ఉన్నట్టు తేలింది. మొదట దానిని చెల్లించి, తర్వాత మిగతా ముచ్చట్లు చెబితే మంచిది. అది విడిచి, ఏదో గారడీ కార్యక్రమం మళ్లా మొదలుపెడితే నిరుద్యోగుల తిరుగుబాటు, ఉద్యమాలను ఎదుర్కునేందుకు తెలంగాణ సర్కారు సిద్ధపడాల్సి రావచ్చు. దుబ్బాక, జీహెచ్ఎంసీలలో బీజేపీ గెలుపు ఫలితాలతోనే ఇంత కదలిక కనబడుతున్నదంటే... రానున్న నాగార్జున సాగర్ ఉపఎన్నిక, కార్పొరేషన్లు, ఎమ్మెల్సీ ఎన్నికలలో గట్టిగా కర్రు కాల్చి ఈ కారు సర్కారుకు ఇంకొంత వాత పెడితే మరికొంత చలనం కలిగే అవకాశం ఉండచ్చు.’ అని విజయశాంతి వ్యాఖ్యానించారు.

    ఇక ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ విషయంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఏళ్ళ తరబడి కళ్ళు కాయలు కాసేలా వేచి చూసిన తరువాత వెలువడిన పీఆర్సీ సిఫారసులను గమనిస్తే ఈ ప్రభుత్వంలో ఎందుకున్నామా? అని రోదించే పరిస్థితి కనిపిస్తోందన్నారు. గడచిన 45 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా అతి తక్కువగా 7.5 శాతం ఫిట్‌మెంట్ సిఫారసు చేసిన పీఆర్సీ నివేదిక ఉద్యోగుల ఆకాంక్షలపై నిప్పులు పోసిందన్నారు. ఉద్యోగులు 65 శాతం ఫిట్‌మెంట్ ఆశిస్తే... సిఫారసు అందులో సగం కూడా లేదన్నారు. ఈ ముఖ్యమంత్రి తమకు కమిషన్ రాని ఏ విధమైన ఖర్చునూ, ఫిట్‌మెంట్‌తో సహా దేనికీ అంగీకరించబోరని ఆరోపించారు. కమిషన్లు దొరికే మోసపు ప్రాజెక్టులకు మాత్రం ఎంతైనా బేఫికర్ ఉంటారన్నారు. వేల, లక్షల కోట్ల అప్పులకైనా రెడీ అవుతారని విజయశాంతి చెప్పారు. సీఎం కాంట్రాక్ట్ కమిషన్ మాత్రం బ్రహ్మాండమైన స్థాయిలో గతంలోని 10 శాతం నుంచి 20 శాతానికి పెంచుకున్నట్టు వ్యాపారవర్గాలు మాట్లాడుకుంటున్నాయని విజయశాంతి ఆరోపించారు.

    తెలంగాణలో నిరుద్యోగ భృతిపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మికుల సంఘం సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నిరుద్యోగ భృతిపై రేపో మాపో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ప్రకటన చేయవచ్చని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటి వరకు లక్షా 31వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్న కేటీఆర్ త్వరలోనే మరో 50వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కేసీఆర్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు