తెలంగాణ బీజేపీ నేతకు డబుల్ ధమాకా ?

మరోసారి తెలంగాణ పార్టీ అధ్యక్ష బాధ్యతలతో పాటు లక్ష్మణ్‌కు మరో కీలక పదవి కూడా దక్కుతుందని తెలుస్తోంది.

news18-telugu
Updated: November 20, 2019, 4:10 PM IST
తెలంగాణ బీజేపీ నేతకు డబుల్ ధమాకా ?
బీజేపీ జెండా
  • Share this:
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు త్వరలోనే కీలక పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. డిసెంబర్‌లో తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో సాగుతోంది. అయితే ఈ సారి మళ్లీ లక్ష్మణ్‌కే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పగ్గాలు ఇచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వినిపించాయి. ఈ మేరకు ఇప్పటికే పార్టీ అధినాయకత్వం నుంచి స్పష్టమై సంకేతాలు కూడా వచ్చాయని తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై లక్ష్మణ్ సారథ్యంలోని బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతోందని... అందుకే ఆయనకు మరో అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలతో పాటు లక్ష్మణ్‌కు మరో కీలక పదవి కూడా దక్కుతుందని తెలుస్తోంది. ఆయనను త్వరలోనే రాజ్యసభకు పంపించాలని బీజేపీ నాయకత్వం భావిస్తోందని సమాచారం. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక లేదా మహారాష్ట్ర నుంచి ఆయనను పెద్దల సభకు పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కిషన్ రెడ్డితో పాటు లక్ష్మణ్ కూడా పోటీపడ్డారు. అయితే సికింద్రాబాద్ సీటును కిషన్ రెడ్డి ఇచ్చిన బీజేపీ... భవిష్యత్తులో మీకు కూడా మంచి అవకాశం ఇస్తామని గతంలోనే హామీ ఇచ్చిందని... ఆ మేరకే ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వనున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.


First published: November 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...