HOME »NEWS »POLITICS »telangana bjp leader kishan reddy criticizes trs working president ktr ak

‘బావిలో కప్పలా కేటీఆర్’… తెలంగాణ బీజేపీ నేత కామెంట్

‘బావిలో కప్పలా కేటీఆర్’… తెలంగాణ బీజేపీ నేత కామెంట్
కేటీఆర్ ఫైల్ ఫోటో(Image:Facebook)

కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు అసలు తెలంగాణనే లేదన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఐదేళ్లలోనే అన్నీ జరిగాయన్నట్టుగా టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు.

  • Share this:
    దేశంలో టీఆర్ఎస్ చక్రం తిప్పుతుందని కేటీఆర్ అనడం హాస్యాస్పదని తెలంగాణ బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి విమర్శించారు. ఆయన మాటలు ఉత్తర కుమారుడి ప్రగల్భాల మాదిరిగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు అసలు తెలంగాణనే లేదన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఐదేళ్లలోనే అన్నీ జరిగాయన్నట్టుగా టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. కేటీఆర్ బావిలో కప్పలా ఊహాలోకంలో విహరిస్తున్నారని విమర్శించిన కిషన్ రెడ్డి... చంద్రబాబుతో పోటీ పడే విధంగా కేటీఆర్ ప్రధాని నరేంద్రమోదీని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు.

    ఐదేళ్లుగా గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని కిషన్ రెడ్డి... కేంద్రం ఇచ్చే నిధులను గ్రామాలకు మళ్లిస్తున్నారని తెలిపారు. ప్రధానిగా అన్ని ప్రాంతాలను ప్రరాజ్యాంగ విరుద్ధంగా కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు బీజేపీ సీనియర్ నేత మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని మరోసారి స్పష్టం చేశారు.    First published:March 09, 2019, 14:17 IST

    टॉप स्टोरीज