Home /News /politics /

TELANGANA BJP INCHARGE TARUN CHUK SLAMS CM KCR OVER TRS PRASHAT KISHOR TIES KCR DELHI TOUR MKS

CM KCR భయం భయం.. ఉక్రెయిన్ ప్రధాని కావొచ్చు.. Prashant Kishor సీన్ ఇదే: చుగ్

కేసీఆర్, పీకే, పీఆర్

కేసీఆర్, పీకే, పీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ కూటమి ప్రయత్నాలు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో మంతనాలపై బీజేపీ ఢిల్లీ స్థాయి నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, పీకేలపై అనూహ్య సెటైర్లు వేశారు. వివరాలివే..

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై, ప్రధాని నరేంద్ర మోదీపై యుద్దం చేస్తానన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత దిశగా కార్యాచరణ వేగవంతం చేశారు. అదే సమయంలో ముందస్తు ఎన్నికల సంకేతమా? అన్నట్లుగా కేసీఆర్.. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తోనూ మంతనాలు ముమ్మరం చేశారు. టీఆర్ఎస్ గెలుపు కోసం పీకే టీమ్ వ్యూహరచన కొనసాగుతుండగా, కేసీఆర్ ఇతర రాష్ట్రాల పర్యటనలు కొనసాగిస్తున్నారు. బీజేపీని బంగాళాఖాతంలో కలిపడమే తన లక్ష్యమన్న కేసీఆర్ తాజాగా చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ కమలదళం ఎప్పటికప్పుడు బదిలిస్తూనే ఉంది. కాగా, కేసీఆర్ జాతీయ కూటమి యత్నాలపై దాదాపు తొలిసారి ఢిల్లీ స్థాయి నేత స్పందించారు. కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ లపై తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు..

చెన్నై, ముంబై పర్యటనల్లో కీలక పార్టీల నేతలను కలిసిన కేసీఆర్ తాజాగా ఢిల్లీ పర్యటన తలపెట్టారు. ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత బెంగళూరు వెళ్లి జేడీఎస్ దేవేగౌడ కుటుంబాన్ని కలవనున్నారు. తెలంగాణ సీఎం వరుస పర్యటనలను ఎద్దేవా చేస్తూ.. కేసీఆర్ పొలిటికల్ టూరిస్టులా తిరుగుతున్నాడని తరుణ్ చుగ్ అన్నారు.

Prashant Kishor: కారెక్కిన ప్రశాంత్ కిషోర్! -KCR దూతతో విస్తృత పర్యటన -షాకింగ్ ట్విస్ట్!


కేసీఆర్ గట్టిగా తలుచుకుంటే భారతదేశానికే కాదు.. ఉక్రెయిన్ కు కూడా ప్రధాని అవుతారని చుగ్ సెటైర్లు వేశారు. నిజానికి కేసీఆర్ భయం భయంగా గడుపుతున్నారని, ఆయన ముఖంలో అది స్పష్టంగా కనిపిస్తోందని, కేవలం తన అవినీతిని కప్పిపుచ్చుకోడానికే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, అలాంటి వ్యక్తి బీజేపీని ఏమీ చేయలేడని తరుణ్ చుగ్ అన్నారు. యుద్దం కేసీఆర్-బీజేపీ మధ్య కానేకాదని, తెలంగాణను కాపాడుకునేందుకే బీజేపీ పోరాడుతున్నదని చుగ్ తెలిపారు. ఇక,

CM KCR ఫామ్‌హౌజ్‌లో Prashant Kishor -తెలంగాణలో ముందస్తు ఎన్నికలు! -TRS భారీ వ్యూహం


ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ఉద్దేశించి తరుణ్ చుగ్ మరింత ఘాటు విమర్శలు చేశారు. బీజేపీని ఏదో చేసేంత సీన్ పీకేకు లేదన్నారు. ప్రశాంత్ కిషోర్‌లు బీజేపీకి అవసరం లేదని, బీజేపీ బూత్ స్థాయి కార్యకర్త ఒక్కో పీకేతో సమానమన్నారు. ప్రశాంత్ కిషోర్.. నరేంద్ర మోదీతో పరిచయం తర్వాతే జాతీయ స్థాయిలో పాపులరైన సంగతి తెలిసిందే. బీజేపీకి దూరమైన తర్వాత పీకే విభిన్న పార్టీల కోసం పనిచేయడం, చేస్తుండటం తెలిసిందే. కేసీఆర్-ప్రశాంత్ కిషోర్ కలయికపై బీజేపీ నేతల వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Prashant kishor, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు