హైదరాబాద్‌లో దేశ ద్రోహులు.. డీజీపీకి బీజేపీ ఫిర్యాదు..

లక్ష్మణ్(ఫైల్ ఫోటో)

హైదరాబాద్‌లో దేశ ద్రోహులు ఉన్నారని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దొంగ డాక్యుమెంట్లతో రోహింగ్యాలు ఆధార్ కార్డు పొందారని, అలా ఆధార్ కార్డు పొందిన 127 మందిపై దర్యాప్తు జరపాలని కోరారు.

 • Share this:
  హైదరాబాద్‌లో దేశ ద్రోహులు ఉన్నారని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దొంగ డాక్యుమెంట్లతో రోహింగ్యాలు ఆధార్ కార్డు పొందారని, అలా ఆధార్ కార్డు పొందిన 127 మందిపై దర్యాప్తు జరపాలని కోరారు. అక్రమ పత్రాలు కలిగిన డేటాను డీజీపీకి అందించిన బీజేపీ బృందం.. వారిపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అనంతరం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. దేశ హితం కోసమే ప్రధాని మోదీ సీఏఏ, ఎన్‌పీఆర్ తీసుకొచ్చారని అన్నారు. సీఏఏ(CAA) బిల్లుపై ఎంఐఎం అనేక ఆరోపణలు చేస్తోందని, రోహింగ్యాలకు ఆ పార్టీ మద్దతు ఇవ్వడం వెనక మతలబేంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతోనే ఆ పార్టీ నేతలు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

  డీజీపీకి బీజేపీ ఫిర్యాదు


  డీజీపీకి బీజేపీ ఫిర్యాదు


  కాగా, చిన్న చిన్న విషయాలకు ట్విట్టర్‌లో స్పందించే ఒవైసీ సోదరులు.. రోహింగ్యాలకు ఆధార్ దక్కిన విషయంలో ఎందుకు స్పందించడం లేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. సీఏఏకు మద్దతుగా మార్చి 15న నిర్వహించే అమిత్ షా సభకు భారీ ఎత్తున ప్రజలు పాల్గొని ఒవైసీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
  Published by:Shravan Kumar Bommakanti
  First published: