కేసీఆర్ స్కీమ్ వెనుక స్కామ్.. సాక్ష్యాలివేనన్న బీజేపీ

కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కలిగిస్తామని లక్ష్మణ్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో త్వరలోనే అప్డేటెడ్ ప్రభుత్వం వస్తుందన్నారు.

news18-telugu
Updated: August 17, 2019, 10:14 PM IST
కేసీఆర్ స్కీమ్ వెనుక స్కామ్.. సాక్ష్యాలివేనన్న బీజేపీ
కేసీఆర్, లక్ష్మణ్
  • Share this:
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ స్కీమ్ వెనుక ఓ స్కామ్ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్మణ్ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని రాబందుల్లా దోచుకుంటున్నారని మండిపడ్డారు. కరీంనగర్‌లో గ్రానైట్ పేరుతో దోచుకుంటున్నారంటున్నారు. అవినీతిలో దేశంలోనే నెంబర్ 2స్థానంలో తెలంగాణ ఉందని లక్ష్మణ్ చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోందని లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. ‘కేసీఆర్ పాలనలో అవినీతి రాజ్యమేలుతోంది. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు డబ్బు చెల్లింపులు లేవు. కొత్త సచివాలయం నిర్మించే బదులు ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు డబ్బులు ఇవ్వొచ్చుకదా..? కళ్యాణలక్మీ, షాదీముబారక్ డబ్బులు లేవు. జీవో నెంబర్ 66తో టీఆర్ఎస్ పార్టీకి అప్పనంగా భూములు కట్టబెడుతున్నారు. దళితులకు మాత్రం మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కలర్ సినిమా చూపిస్తున్నారు. ఇంటర్ బోర్డులో తప్పిదాలు ప్రభుత్వ నిర్లక్ష్యమే. 27 మంది విద్యార్థుల మృతికి ప్రభుత్వమే కారణం. ఇంటర్ బోర్డుకు సంబంధించిన కుట్ర ప్రభుత్వానిదే.’ అని అన్నారు.

కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కలిగిస్తామని లక్ష్మణ్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో త్వరలోనే అప్డేటెడ్ ప్రభుత్వం వస్తుందన్నారు. బొందుగాళ్లు అన్న కేసీఆర్ మాటలకు కరీంనగర్ ప్రజలు బుద్ధి చెప్పారని లక్ష్మణ్ అన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదాపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పారు. జాతీయ హోదా ఇస్తే కమీషన్లు రావని, అవినీతి బయటపడుతుందన్నారు.
First published: August 17, 2019, 10:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading