ఆర్టీసీ సమ్మెపై... కేంద్రం స్పందన... ఎప్పుడో చెప్పిన లక్ష్మణ్

సమ్మెపై కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో స్పందిస్తుందని తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ చెప్పారు. సమ్మెపై రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరించదని ఆయన వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: November 17, 2019, 6:01 PM IST
ఆర్టీసీ సమ్మెపై... కేంద్రం స్పందన... ఎప్పుడో చెప్పిన లక్ష్మణ్
తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్(ఫైల్ ఫోటో)
  • Share this:
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేంద్రానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తున్నామని ఆయన తెలిపారు. సమ్మె పై కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో స్పందిస్తుందని చెప్పారు. సమ్మెపై రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరించదని ఆయన వ్యాఖ్యానించారు. శాంతి భద్రతల సమస్య వస్తే మాత్రం కేంద్రం కలుగజేసుకుంటుందని లక్ష్మణ్ తెలిపారు. మరోవైపు సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు.

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా పోరాడిన నాయకులను అరెస్ట్ చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. మందకృష్ణ అరెస్ట్ అన్యాయం అని ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు. కార్మికులకు మద్దతుగా 19న రాస్తారోకోకు తానే నాయకత్వం వహిస్తానని లక్ష్మణ్ వెల్లడించారు.


First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com