Home /News /politics /

TELANGANA BJP CHIEF BANDI SANJAY SAID THAT IT HAS BEEN DECIDED TO ORGANIZE A MILLION MARCH UNDER THE AUSPICES OF YUVA MORCHA IN THE COMING ASSEMBLY BUDGET MEETINGS PRV

Bandi sanjay: టీఆర్​ఎస్​ ప్రభుత్వంపై మరోసారి ఎటాక్​కు బీజేపీ సిద్ధం​.. వచ్చే అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల్లో మిలియన్​ మార్చ్​కు సన్నాహాలు

Bandi-Sanjay-Kumar

Bandi-Sanjay-Kumar

తెలంగాణలో కేసీఆర్ పాలన పట్ల జనం విసిగిపోయారని.. టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదిరించే పార్టీ బీజేపీ మాత్రమేనని జనం భావిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో యువ మోర్చా ఆధ్వర్యంలో

    తెలంగాణలోని టీఆర్​ఎస్​ ప్రభుత్వ (TRS Government) తీరును ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తమ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (Telangana BJP Chief Bandi sanjay)​ పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్ పాలన పట్ల జనం విసిగిపోయారని.. టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదిరించే పార్టీ బీజేపీ (BJP) మాత్రమేనని జనం భావిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో యువ మోర్చా (Yuva Morcha) ఆధ్వర్యంలో ‘మిలియన్ మార్చ్ (Million march)’ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.  రాష్ట్రస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యువ, కిసాన్, మహిళా, మైనారిటీ మోర్చాల అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులతో బండి సంజయ్ వర్చువల్ మీటింగ్ (Virtual meeting) నిర్వహించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల మోర్చాల ప్రతినిధులతో సుధీర్ఘంగా సమీక్షించారు. అయితే.. పార్టీ నేతలపై అధికార పార్టీ నేతలు దాడులతోపాటు.. అక్రమ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నందున మోర్చాల నాయకులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని బండి సంజయ్ సూచించారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందిస్తూ కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

    కులాలు ఎదుర్కొంటున్న సమస్యలపై..

    తెలంగాణలోని ఆయా కులాలు (castes) ఎదుర్కొంటున్న సమస్యలపైనా, ఆత్మగౌరవ భవనాల నిర్మాణం వంటి అంశాలపై ఓబీసీ మోర్చా.. దళిత బంధు (Dalitha bandhu), దళితులకు మూడెకరాలు, పోడు భూములు సహా దళితులు, గిరిజన మోర్చాలు, మహిళలు, మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహిళా, మైనారిటీ మోర్చా రాష్ట్ర నాయకత్వం ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఉద్యోగాల కల్పనపై రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించాలని.. వర్శిటీలు, హాస్టళ్ల, కోచింగ్ సెంటర్లను సందర్శించాలని కార్యకర్తలకు బండి సంజయ్​ సూచించారు.

    రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల (Assembly Budget sessions) సందర్భంగా  యువ మోర్చా ఆధ్వర్యంలో  ఉద్యోగాల సాధన కోసం ‘మిలియన్ మార్చ్’ నిర్వహించాలని బండి సంజయ్ (Bandi Sanjay)​ సూచించారు. ఈలోపు నిరుద్యోగులను, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా విస్త్రతంగా పర్యటించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. త్వరలో మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతూ ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు.

    మోదీ బాటలోనే నడవాలి..

    ‘‘దేశంలో బీజేపీని బలోపేతం చేసేందుకు, ప్రజల అభ్యున్నతి కోసం ప్రధాని నరేంద్రమోదీ (Narendra modi) రోజుకు 18 గంటలు కష్టపడుతున్నరు. మోదీ బాటలోనే నడవాలి. మోర్చాల నాయకులు, కార్యకర్తలంతా రాబోయే రెండేళ్లు పూర్తిగా జనంలోనే ఉండాలే యాక్షన్ ప్లాన్ రూపొందించుకోండి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనతో విసిగిపోయారు. టీఆర్ఎస్ (TRS) అరాచక పాలనను అంతమొందించే పార్టీ కోసం ఎదురు చూస్తున్నరు. బీజేపీకి మాత్రమే ఆ సత్తా ఉందని నమ్మకంతో ఉన్నారు. టీఆర్ఎస్ అవినీతి-నియంత-కుటుంబ పాలనను అంతమొందిద్దాం.. అధికార పార్టీ నేతల ఆగడాలను ఎదురిద్దాం.. అధికారాన్ని కైవసం చేసుకుందాం. ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం... ఈ విషయంలో కార్యకర్తలు, నాయకులకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటూ ఆదుకుంటామనే విషయాన్ని విస్మరించొద్దు.’’అని పేర్కొన్నారు.•

    పార్టీ నేతలపై అధికార పార్టీ నేతలు దాడులు చేస్తున్నందున... అక్రమ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నందున మోర్చాల నాయకులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని బండి కోరారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందిస్తూ కార్యాచరణ రూపొందించాలని ఆయన సూచించారు. ఈ విషయంలో మోర్చాల పనితీరును మరింతగా మెరుగు పర్చుకోవాలని కోరారు.

    ఏ కష్టమొచ్చినా ఆదుకునేందుకు జాతీయ నాయకత్వం ఉంది..

    ‘‘రాష్ట్రంలో బీజేపీ నేతలకు ఏ కష్టమొచ్చినా, ఆపదొచ్చినా ఆదుకునేందుకు జాతీయ నాయకత్వం సిద్దంగా ఉంది. స్పందించింది. కరీంనగర్ లో నాపైన, నిజామాబాద్ అరవింద్ పై దాడి జరిగిన వెంటనే జాతీయ నాయకత్వం స్పందించిన తీరే ఇందుకు నిదర్శనం. జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు మొదలుకుని పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నరేంద్రమోదీ స్పందించిన తీరే ఇందుకు నిదర్శనం. పంజాబ్ ఘటనలో తన కాన్వాయ్ పై దాడి జరిగినా... ఆ అంశాన్ని పక్కనపెట్టి నరేంద్రమోదీ తనకు ఫోన్ చేసి అండగా నిలిచారు. జరిగిన ఘటన పూర్వాపరాలు తెలుసుకోవడంతోపాటు తెలంగాణలో బీజేపీ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.’’అని గుర్తు చేశారు. మోదీ బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని, రాష్ట్రంలో ఏ కార్యకర్తకు కష్టమొచ్చినా మేం ఉన్నామనే భావనను మోర్చాల నేతలు కల్పించాలని కోరారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bandi sanjay, Politics, Telangana bjp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు