నాగులు కుటుంబానికి రూ.25లక్షల పరిహారం, బండి సంజయ్ డిమాండ్

బండి సంజయ్(ఫైల్ ఫోటో)

Bandi Sanjay: నాగులు కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

  • Share this:
    Nagulu Suicide: తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన నాగులు అనే వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. నాగులు కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం తో అధికారం లోకి వచ్చిన కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం వల్లనే ఇంకా ఈ రాష్ట్రం లో ఆత్మహత్యల పరమంపర కొనసాగుతుందన్నారు. ‘నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేస్కుంటే, నేడు బ్రతకలేక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. రవీంద్ర భారతి వద్ద ఆత్మ హత్యా ప్రయత్నం చేసిన నాగులు మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. నేడు తెలంగాణలో ఉన్నటువంటి దుస్థితికి నాగులు మరణం అద్దం పడుతుంది. అస్తవ్యస్త విధానాలతో, దుబారాతో , క్రమశిక్షణా రాహిత్యంతో ధనిక రాష్ట్రాన్ని కాస్తా ,అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత టీఆర్‌ఎస్‌కే చెందుతుంది. 5 నెలల నుంచి ప్రయివేటు టీచర్లు, చిరు ఉద్యోగస్తులు తమ ఉపాధి కోల్పోయిన సందర్బంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకొనే చర్య ఒక్కటి కూడా చేపట్టకపోవడం దారుణం. ఆర్థికంగా రాష్ట్రం దివాలా తియ్యడం వల్లనే నేడు ఈ పరిస్థితి దాపురించింది. కాబట్టి నాగులు లాంటి అనేక మంది ప్రయివేటు టీచర్లు దుస్థితికీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. నాగులు మరణంతో ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. ఇకనైనా ప్రయివేటు టీచర్లను ఆదుకునే చర్యలు చేపట్టాలి.’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: