హోమ్ /వార్తలు /National రాజకీయం /

పవన్ కల్యాణ్ పరువు తీసిన మిత్రుడు.. మంచు ముక్కలా బీజేపీ-జనసేన బంధం.. Maa ఫలితాలపై బండి సంజయ్ బాంబు

పవన్ కల్యాణ్ పరువు తీసిన మిత్రుడు.. మంచు ముక్కలా బీజేపీ-జనసేన బంధం.. Maa ఫలితాలపై బండి సంజయ్ బాంబు

మా ఫలితాలపై బీజేపీ బండి సంజయ్

మా ఫలితాలపై బీజేపీ బండి సంజయ్

Bandi sanjay on Maa election result: సైద్దాంతిక విరోధిని సమర్థిస్తే రాజకీయ మిత్రుడిని సైతం సహించబోమని బీజేపీ తమ అలయెన్స్ కు చెప్పదలిచిందా? టాలీవుడ్ మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ కు పవన్ కల్యాణ్ మద్దతివ్వడాన్ని కమలనాథులు సీరియస్ గా తీసుకున్నారా? మంచు విష్ణు గెలుపును ‘జాతీయవాద వ్యతిరేక శక్తుల’ఓటమిగా బండి సంజయ్ అభివర్ణించడంలో అర్థం అదేనా? మా ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఏమన్నారంటే..

ఇంకా చదవండి ...

పేరుకు అదొక సాధారణ అసోసియేషన్ ఎన్నిక.. రాజకీయ పార్టీలకు సంబంధం లేదని చెప్పే‘మాలో మేం’ బాపతు లెక్క. సైజులో స్థానిక వార్డు ఎన్నిక కంటే తక్కువే అయినా సినిమాలకుండే క్రేజ్ వల్ల మా ఎన్నికలకు అసాధారణ అటెన్షన్ లభించింది. అయితే, వాస్తవంలో మాత్రం మా ఎన్నికల ముందు, వెనుకా, లోపలా అంతా రాజకీయమే సాగిందన్నది కాదనలేని సత్యం. మా రాజకీయాలపై మిగతా పార్టీల వాళ్లు గమ్మున ఉండిపోగా.. బోళా మనిషిగా పేరున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాత్రం బాంబు పేల్చారు. ఈ పరిణామం.. బీజేపీ తన మిత్రపక్షమైన జనసేన పవన్ కల్యాణ్ పరువు తీసినట్లుగా ఉందని కామెంట్లు వస్తున్నాయి..

మెగా ఫ్యామిలీపై ట్రోలింగ్

టాలీవుడ్ ‘మా’(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ విజయం సాధించిన మరుక్షణం నుంచి సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీపై కామెంట్లు పేలుతున్నాయి. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు ముందు నుంచీ మెగా ఫ్యామిలీ మద్దతుగా నిలవడం, చిరంజీవి సంయమనం పాటించినా, నాగబాబు ఓ స్థాయిలో మంచును ఏకిపారేయడం, మూడో మెగా బ్రదర్, జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కల్యాణ్ సైతం మంచు కుటుంబానికి పలు సవాళ్లు విసరడం లాంటి పరిణామాలు మా ఎన్నికల వేడిని మరింత రాజేశాయి. పార్టీలు, కులాల కోణంలోనూ మా ఎన్నికలు సరికొత్త ఈక్వేషన్లకు దారితీశాయనే చర్చ సాగింది.

మాలో కులాలు, కొత్త ఈక్వేషన్లు!

మా ఫలితంపై సోషల్ మీడియాలో సాగిన మెజార్టీ విశ్లేషణల్లో కుల, పార్టీల ప్రస్తావనే చోటుచేసుకుంది. మంచు విష్ణు గెలుపు.. టాలీవుడ్ పై (టీడీపీ)కమ్మ కులస్తుల ఆధిపత్యాన్ని నిరూపించిందనే, అదే సమయంలో అనూహ్యంగా (జగన్)రెడ్డి పార్టీని, (బీజేపీ)జాతీయ పార్టీని వారు కలుపుకొని పోయారని, తద్వారా ఇండస్ట్రీకి పెద్దరికం వహించాలనుకున్న మెగా(కాపు) కుటుంబానికి చెక్ పెట్టగలిగారనే కోణంలో ఆ విశ్లేషణలున్నాయి. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాపులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, వారి చుట్టూనే రాజకీయం సాగిస్తోన్న బీజేపీ మాత్రం మా ఎన్నికల్లో మరో స్ట్రాటజీని అనుసరించడం, వైసీపీ అనుకూల వ్యక్తులతో కలిసి బీజేపీ నేతలు బరిలోకి దిగడం కొత్త సంకేతాలిచ్చినట్లయింది. తద్వారా బీజేపీ.. కాపులను, పవన్ కల్యాణ్ ను వేర్వేరుగా చూస్తోందనే స్పష్టత ఇచ్చినట్లయింది. దీనికి కొనసాగింపుగా..

జాతీయవాద వ్యతిరేకులు..

టాలీవుడ్ మా ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయవాద వ్యతిరేక శక్తులను చిత్తుగా ఓడించిన మా ఓటర్లకు ధన్యవాదాలంటూ బండి.. పరోక్షంగా ప్రకాశ్ రాజ్ ను దెప్పిపొడిచారు. నటుడు ప్రకాశ్ రాజ్ చాలా కాలంగా బీజేపీతో సైద్ధాంతిక పోరు చేస్తుండటం, జాతీయ స్థాయిలో యాంటీ మోదీ వాయిస్ వినిపిస్తోన్న నేపథ్యంలో వినిస్తున్న నేపథ్యంలో బండి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. తుకుడే గ్యాంగ్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు విద్యార్థి నేతలకు ప్రకాశ్ రాజ్ మద్దతు ఇవ్వడాన్ని కూడా బండి ప్రస్తావించారు. అయితే, మా ఎన్నికల నేపథ్యంలో ఆ పదాలకు నానార్ధాలు, పవన్ కు అంటగట్టడాలు జరిగిపోయాయి.  ప్రకాశ్ రాజ్ కు పవన్ కల్యాణ్ అండగా ఉన్నారన్న వాస్తవం తెలిసికూడా.. పీకేనూ ఆల్మోస్ట్ జాతీయవాద వ్యతిరేక జాబితాలో చేర్చినంత స్థాయిలో బండి కామెంట్లు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అదే సమయంలో వైసీపీ మద్దతిచ్చినట్లుగా చెప్పుకుంటోన్న మంచు విష్ణుకు బండి అభినందనలు తెలిపారు..

పీకే తుకుడే గ్యాంగ్?

‘మా అధ్యక్షుడిగా గెలిచిన మంచు మంచు విష్ణుకు, రెండు ప్యానెళ్ల నుంచి గెలిచిన విజేతలందరికి శుభాకాంక్షలు. జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన "మా" ఓటర్లకు ధన్యవాదాలు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగింది. "మా" ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారా అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూశారు. "మా" ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు. అందరికి అభినందనలు. భారత్ మాతాకి జై !’అని బండి సంజయ్ వరుస ట్వీట్లు చేశారు.

జనసేనతో బీజేపీ రాంరాం..

రాజకీయంగా మిత్రుడైన జనసేనాని పవన్ కల్యాణ్ మద్దతిచ్చిన వ్యక్తిని విమర్శిస్తే, అది బీజేపీకి బూమరాంగ్ కాబోదా? అనే చర్చ కూడా సోషల్ మీడియాలో హైలైట్ అయింది. కేవలం ప్రకాశ్ రాజ్ పై వ్యతిరేకతను కనబర్చడానికి లేదా అతని ఓటమిని సెలబ్రేట్ చేసుకోడానికి మిత్రుడైన పవన్ ను తుకుడే గ్యాంగ్ తో పోల్చడాన్ని జనసేన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి తెలంగాణ బీజేపీకి పవన్ అవసరం లేనేలేదని బండి సంజయ్ పలు మార్లు బాహాటంగా ప్రకటనలు చేసినా, హైకమాండ్ ఆదేశాల మేరకు అప్పుడప్పుడూ వపన్ మర్యాదపూర్వకంగానైనా కలుస్తూ వస్తున్నారు. మా ఫలితంపై బండి కామెంట్లతో బీజేపీ, జనసేన మధ్య స్నేహం మంచులా కరుగుతోందనే సంకేతాలిచ్చినట్లయిందనీ కామెంట్లు వస్తున్నాయి. అటు, ఏపీలో బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన తలోదారి చూసుకోవడం, చంద్రబాబుకు పవన్ మళ్లీ దగ్గరవుతున్నారనే ప్రచారం జోరందుకోవడం లాంటి పరిణామాలు తెలిసిందే.

Published by:Madhu Kota
First published:

Tags: Bandi sanjay, Bjp-janasena, MAA, MAA Elections, Pawan kalyan

ఉత్తమ కథలు