Telangana: టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. రేపే కీలకం.. అందరి చూపు ఆయనపైనే. ?

అమిత్ షా (File)

Telangana News: నిర్మల్ సభకు రానున్న అమిత్ షా.. టీఆర్ఎస్‌పై ఏ స్థాయిలో విరుచుకుపడితే తమకు అంత లాభం కలుగుతుందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.

  • Share this:
    తెలంగాణలో రాజకీయం త్రిముఖ పోటీని తలపిస్తోంది. అధికార టీఆర్ఎస్‌తో పోటీ పడేందుకు, పోరాడేందుకు ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ సై అంటే సై అంటున్నాయి. ఈ రెండు పార్టీలు తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే రాజకీయ ప్రత్యామ్నాయమని చెబుతున్నాయి. టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించడంలో, రాజకీయ దాడి చేయడంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నాయి కాంగ్రెస్, బీజేపీ. రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ టీఆర్ఎస్‌పై పొలిటికల్ వార్ ప్రకటించగా.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తూ టీఆర్ఎస్‌పై సమరశంఖం పూరిస్తున్నారు. ఇక రేపు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈ రెండు పార్టీలు వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సభలు ఏర్పాటు చేసుకున్నాయి. అయితే కాంగ్రెస్ సభతో పోలిస్తే.. బీజేపీ నిర్మల్‌లో ఏర్పాటు చేసిన సభకు కాస్త ఎక్కువ రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.

    ఇందుకు అసలు కారణం.. ఈ సభకు బీజేపీ జాతీయ ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానుండటమే. రేపు నిర్మల్ సభకు వస్తున్న అమిత్ షా.. తెలంగాణ విమోచన దినోత్సవంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అలాంటి ప్రకటన చేసినా.. చేయకపోయినా.. ఆయన ఈ సభలో ఏం మాట్లాడతారనే అంశంపై తెలంగాణ బీజేపీ శ్రేణులు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ సందర్భంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ గల్లీలోనే కొట్టుకుంటాయని.. డిల్లీలో మాత్రం రెండు పార్టీల మధ్య దోస్తీ ఉందని కాంగ్రెస్ వంటి పార్టీలు విమర్శించాయి. ఇది టీఆర్ఎస్ కంటే బీజేపీకి ఎక్కువ ఇబ్బందిగా మారింది.

    Telangana BJP: కేంద్రమంత్రిపై తెలంగాణ బీజేపీ అసహనం.. ఇలా చేస్తే ఎలా అంటూ..

    Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్లాన్ సక్సెస్.. సైలెంట్ అయిన సీనియర్ నేత.. కాంగ్రెస్‌లో చర్చ

    ఈ నేపథ్యంలో రేపు నిర్మల్ సభకు రానున్న అమిత్ షా.. టీఆర్ఎస్‌పై ఏ స్థాయిలో విరుచుకుపడితే తమకు అంత లాభం కలుగుతుందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆయన చేసే వ్యాఖ్యలతో కాంగ్రెస్ వంటి పార్టీల నోరు మూతపడటంతో పాటు తమ పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉంటే రేపు అమిత్ షా టీఆర్ఎస్‌పై తీవ్రంగా విమర్శిస్తే.. గులాబీ పార్టీ నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ ఉండొచ్చని.. అప్పుడు ఈ రెండు పార్టీల మధ్య పొలిటికల్ వార్ మరింతగా ముదిరే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: