గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ రిలీజ్ చేసింది. 21 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన బీజేపీ జాతీయ భూపేంద్ర యాదవ్‌తో కలసి చర్చించిన మీదట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ పేర్లను ఖరారు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్లకు ఈనెల 20వ తేదీ ఆఖరు కావడంతో అన్ని పార్టీలు ఆగమేఘాల మీద అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ 105 డివిజన్లలో అభ్యర్థులను ఖరారు చేస్తూ మొదటి జాబితాను విడుదల చేసింది. ఇక తెలంగాణ కాంగ్రెస్ కూడా 29 మందితో తొలి జాబితాను ప్రకటించింది. ఇప్పుడు బీజేపీ కూడా 21 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది.
మొదటి జాబితాలో బీజేపీ ప్రకటించిన అభ్యర్థులు
పత్తర్ గట్టి - అనిల్ బజాజ్
మొఘల్ పురా - మంజుల
పురానాపూల్ - కొంగర సురేందర్ కుమార్
కార్వాన్ - కట్ల అశోక్
లంగర్ హౌజ్ - సుగంధ పుష్ప
టోలిచౌకి - రోజా
నానల్ నగర్ - కరణ్ కుమార్
సైదాబాద్ - అరుణ
అక్బర్ బాగ్ - నవీన్ రెడ్డి
డబీర్ పురా - మిర్జా అఖిల్ అఫండి
రెయిన్ బజార్ - ఈశ్వర్ యాదవ్
లలిత్ బాగ్ - చంద్రశేఖర్
కుర్మగూడ - ఉప్పాళ్ల శాంత
ఐఎస్ సదన్ - జంగం శ్వేత
రియాసత్ నగర్ - మహేందర్ రెడ్డి
చాంద్రాయణ గుట్ట - నవీన్ కుమార్
ఉప్పుగూడ - టి. శ్రీనివాసరావు
గౌలిపురా - ఆలె భాగ్యలక్ష్మి
షాలిబండ - నరేష్
దూద్ బౌలి - నిరంజన్ కుమార్
ఓల్డ్ మలక్ పేట్ - కె.రేణుక
BJP Candidates List for GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా
మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లకు బీజేపీ ఇన్ చార్జిలను నియమించింది. ఆయా నియోజకవర్గాల్లోని డివిజన్లలో బీజేపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను ఆ నేతలు పర్యవేక్షించనున్నారు.
1.ఎల్బీనగర్ - సంకినేని వెంకటేశ్వర రావు
2.మహేశ్వరం - యెన్నం శ్రీనివాస్ రెడ్డి
3.రాజేంద్రనగర్ - వన్నల శ్రీరాములు
4.శేరిలింగంపల్లి -ధర్మపురి అరవింద్
5.ఉప్పల్-ధర్మారావు
6.మాల్కజిగిరి -రఘునందన్ రావు
7.కుత్బుల్లాపూర్ - చాడ సురేష్ రెడ్డి
8.కూకట్ పల్లి - పెద్దిరెడ్డి
9. పటాన్ చేరు - పొంగులేటి సుధాకర్ రెడ్డి
10. అంబర్పేట్ - రేవూరి ప్రకాశ్ రెడ్డి
11.ముషీరాబాద్ - జితేందర్ రెడ్డి
12.సికింద్రాబాద్ - విజయరామ రావు
13.కంటోన్మెంట్ - శశిధర్ రెడ్డి
14.సనత్ నగర్ - మోత్కుపల్లి నర్సింహులు
15.జూబ్లీహిల్స్- ఎర్ర చంద్ర శేఖర్
16.ఖైరతాబాద్ - మృత్యుంజయ
17.నాంపల్లి - సాయం బాపురావు
18.చార్మినార్ -కాసిపేట లింగయ్య
19.గోశామహల్ - యెండల లక్ష్మీనారాయణ
20.కార్వాన్ - బొడిగే శోభ
21.మలక్ పేట - విజయపాల్ రెడ్డి
22.యకత్ పుర - రామకృష్ణ రెడ్డి
23.చాంద్రాయణగుట్ట - రవీంద్ర నాయక్
24.బహదూర్ పుర - సుద్దాల దేవయ్య
ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా బరిలో దిగనుంది. ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదు. ఎంఐఎంతోనే తమ పోటీ ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా బరిలో దిగనుంది. ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదు. ఎంఐఎంతోనే తమ పోటీ ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. 150 డివిజన్లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 2016లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం 4 సీట్లలో మాత్రమే గెలుపొందింది. అయితే, ఇప్పుడు సీన్ మారిందని, రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెబుతోంది. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కైవసం చేసుకోవడం ద్వారా బీజేపీ మంచి జోష్ మీద ఉంది. ఆ ఉత్సాహాన్ని జీహెచ్ఎంసీలో కొనసాగించాలనుకుంటోంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.