బంద్ సంపూర్ణం.. సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం : ఆర్టీసీ జేఏసీ

Telangana Bandh : ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్‌కు మద్దతుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,ఎమ్మెల్యే శ్రీధర్ బాబు,మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చార్మినార్‌లో మెరుపు ర్యాలీ చేపట్టారు.

news18-telugu
Updated: October 19, 2019, 2:39 PM IST
బంద్ సంపూర్ణం.. సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం : ఆర్టీసీ జేఏసీ
ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి,సీఎం కేసీఆర్ (File Photos)
news18-telugu
Updated: October 19, 2019, 2:39 PM IST
శనివారం తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ సంపూర్ణంగా జరిగిందని ఆర్టీసీ జేఏసీ ప్రెస్ నోట్ విడుదల చేసింది. బంద్‌కు మద్దతునిచ్చిన,సహకరించిన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు తెలిపింది. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తున్నవారిని అరెస్ట్ చేయడం అక్రమమని.. ఆ అరెస్టులను ఖండిస్తామని వెల్లడించింది.అరెస్టులు చేసే క్రమంలో.. భౌతిక దాడులకు పాల్పడటం సరికాదని పేర్కొంది. అరెస్ట్ చేసినవారందరినీ బేషరతుగా విడుదల చేయాలని,సాయంత్రానికి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించింది.

ఇదిలా ఉంటే, ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్‌కు మద్దతుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,ఎమ్మెల్యే శ్రీధర్ బాబు,మాజీ ఎంపీ
అంజన్ కుమార్ యాదవ్ చార్మినార్‌లో మెరుపు ర్యాలీ చేపట్టారు. రాజీవ్ సద్భావన యాత్ర అనంతరం కార్మికులకు సంఘీభావంగా ర్యాలీగా బయలుదేరారు. స్థానిక దుకాణాలను మూసివేయించారు. అయితే ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు.. నేతలను అరెస్ట్ చేసి బహదూర్‌పుర పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

First published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...