• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELANGANA BANDH PROTESTERS STONE PELTING ON BUS IN NIZAMABAD MS

Telangana Bandh : బంద్ ఎఫెక్ట్.. బస్సుపై రాళ్ల దాడి.. పలుచోట్ల ఉద్రిక్తతలు

Telangana Bandh : బంద్ ఎఫెక్ట్.. బస్సుపై రాళ్ల దాడి.. పలుచోట్ల ఉద్రిక్తతలు

బస్టాండ్‌లో పోలీసుల మోహరింపు

Telangana Bandh : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దాస్‌నగర్ వద్ద ఓ ఆర్టీసీ బస్సుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో పోలీస్ భద్రత నడుమ బస్సును అక్కడినుంచి వరంగల్ వైపు తీసుకెళ్లారు.

  • Share this:
    తెలంగాణలో 15 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె నేటి బంద్‌తో మరింత తీవ్రమైంది. బంద్‌కు ప్రతిపక్ష పార్టీలు,ప్రజాస్వామ్య సంఘాలు మద్దతుగా నిలిచాయి. దీంతో బంద్‌ను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ఎక్కడికక్కడ పోలీసులను మోహరించింది. కీలక నేతలను అరెస్ట్ చేయించింది. అయినప్పటికీ చాలాచోట్ల ఆందోళనలు,నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దాస్‌నగర్ వద్ద ఓ ఆర్టీసీ బస్సుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో పోలీస్ భద్రత నడుమ బస్సును అక్కడినుంచి వరంగల్ వైపు తీసుకెళ్లారు. ఆర్మూర్‌ డిపోలో బస్సులు బయటకు రాలేదు. దీంతో ప్రయాణికులు లేక బస్ స్టేషన్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

    ఇక హైదరాబాద్‌లోని నాగోల్ బండ్లగూడ బస్ డిపో వద్ద డీజిల్ ట్యాంకర్‌ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. డీజిల్ ట్యాంకర్ టైరుకు మేకులు కొట్టేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఓ ప్రైవేట్ డ్రైవర్‌ను కూడా ఆర్టీసీ కార్మికులు చితకబాదారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఎంజీబీఎస్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.వరంగల్ జిల్లాల్లోనూ బంద్ కొనసాగుతోంది. వ్యాపార,వాణిజ్య సంస్థలు స్వచ్చందంగా బంద్‌లో పాల్గొంటాయి. బంద్ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు అడ్డగించే అవకాశం ఉండటంతో ప్రైవేట్ డ్రైవర్లు,కండక్టర్లు కూడా డిపోలకు రాలేదు. చాలాచోట్ల కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు.
    Published by:Srinivas Mittapalli
    First published: