9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఈనెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలుప్రారంభం కానున్నాయి. అదే రోజు బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు.

news18-telugu
Updated: September 1, 2019, 5:27 PM IST
9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ
  • Share this:
ఈనెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలుప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం 11.30 గంటలకు సమావేశాలను ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. అదే రోజు బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ సారి వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలో దుమ్మెత్తిపోస్తున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల అంశం సభలో దుమారం లేపే అవకాశం ఉంది. అయితే, బీజేపీకి కేవలం ఒక్క సభ్యుడు మాత్రమే ఉన్నారు. ఆ పార్టీ సభలో ఎలాంటి వ్యూహాన్ని అవలంభిస్తుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు, ప్రత్యేక తెలంగాణకు గవర్నర్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన ఈఎస్‌ఎల్ నరసింహన్‌ స్థానంలో కొత్త గవర్నర్‌గా తమిళిసై సౌందర్‌రాజన్ నియమితులు అయ్యారు. ఈ క్రమంలో గవర్నర్ నరసింహన్ రాష్ట్రానికి అందించిన సహాయ సహకారాల మీద సభలో అభినందించే తీర్మానాన్ని పెట్టొచ్చు.

First published: September 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>