తెలంగాణ ఎన్నికలు: ఓటింగ్ శాతం పెంచేందుకు పార్టీల పాట్లు

Live Updates Telangana Assembly poll 2018: తెలంగాణ ఎన్నికల్లో చివరి గంటలో పోలింగ్ శాతం పెంచేందుకు వివిధ పార్టీలు తీవ్రంగా శ్రమించాయి.

news18-telugu
Updated: December 7, 2018, 4:40 PM IST
తెలంగాణ ఎన్నికలు: ఓటింగ్ శాతం పెంచేందుకు పార్టీల పాట్లు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: December 7, 2018, 4:40 PM IST
తెలంగాణ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు రాజకీయ పార్టీలు నానా తంటాలు పడ్డాయి. ముఖ్యంగా చివరి గంటల్లో పార్టీల కార్యకర్తలు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు భారీ ఎత్తున కృషి చేశారు. ముఖ్యంగా నగరాల్లోని కొన్ని బస్తీల్లో చివరి నిమిషం వరకు పోలింగ్ కేంద్రాలకు రాని వారిని పార్టీల నాయకులు, కార్యకర్తలు పోలింగ్ స్టేషన్లకు తరలించేందుకు పాట్లుపడ్డారు. వారిని ఆటోలు, ట్రాలీల్లో కూడా తరలించిన పరిస్థితి. ఓటు తమ పార్టీకి కచ్చితంగా వేస్తారని గ్యారెంటీ ఉన్నవారు ఆటోలకు డబ్బులిచ్చి మరీ వారిని పోలింగ్ కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చివరి గంటల్లో భారీ ఎత్తున బేరసారాలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. పలు పార్టీల కార్యకర్తలు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. చాలా చోట్ల నియోజకవర్గాలు ఓటర్ల ఇళ్లకు దూరంగా ఉన్నాయి. కొన్నిచోట్ల ఓటర్లు ఒక చోట ఉంటే, పోలింగ్ కేంద్రం ఎక్కడో చాలా దూరంలో ఏర్పాటయ్యాయి. పోలింగ్ కేంద్రాలు కిలోమీటర్ల మేర దూరం ఉండడం వల్ల చాలా మంది ఓటు వేయడానికి నిరాసక్తత కనబరిచారు.

First published: December 7, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...