ఓట్లు గల్లంతు: పోలింగ్ నిలిపివేయాలంటూ ఓటర్ల ఆందోళన

Live Updates Telangana Assembly poll 2018 |తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓటర్ల ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో వారు ఆందోళనకు దిగారు.

news18-telugu
Updated: December 7, 2018, 12:27 PM IST
ఓట్లు గల్లంతు: పోలింగ్ నిలిపివేయాలంటూ ఓటర్ల ఆందోళన
ఓటు వేసేందుకు క్యూలో నిలబడిన ఓటర్లు
news18-telugu
Updated: December 7, 2018, 12:27 PM IST
తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేద్దామని వెళ్లిన వారికి షాక్ తగిలింది. తమ ఓటు లేకపోవడంతో ఓటర్లు షాక్‌కి గురయ్యారు. తమ ఓటు ఏమైందని అధికారులను ప్రశ్నించారు. గ్రామాల్లో ఓటర్లు కూడా తొలగిస్తారా? అంటూ ఓటర్లు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో చనిపోయిన వారి పేర్లు ఓటర్ లిస్టులో ఉన్నాయి, కానీ బ్రతికి ఉన్న వారి పేర్లు ఓటర్ లిస్టులో లేవని బాధితులు తమ నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి, నిజామాబాద్, వనపర్తి, చాంద్రాయణగుట్ట, ఖమ్మంలో పలుచోట్ల ఓట్లు గల్లంతయ్యాయి. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో 1,500 ఓట్లు గల్లంతు అవ్వడంతో బీక్కనూర్ ఎంఆర్‌ఓనీ గ్రామస్థులు నిలదీశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఓటర్ లిస్ట్ లో పేర్లు లేవని ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు బాధితులు ఆందోళకు దిగారు. తమకు ఓటు వేసే అవకాశం ఇవ్వాలని లేకపోతే పోలింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం, వనపర్తి, చాంద్రాయణగుట్టల్లో కూడా కొన్నిచోట్ల ఓటర్ల ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి
First published: December 7, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...