రాఘవేంద్రరావుకు షాక్, ఓటు వేయకుండా వెనక్కి

Live Updates Telangana Assembly poll 2018 | అందరూ క్యూలో నిలబడగా, రాఘవేంద్రరావు మాత్రం డైరెక్టుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లబోయారు. దీంతో అక్కడున్నవారు దర్శకుడిని అడ్డుకున్నారు.

news18-telugu
Updated: December 7, 2018, 1:44 PM IST
రాఘవేంద్రరావుకు షాక్, ఓటు వేయకుండా వెనక్కి
ఓటు వేసేందుకు వెళ్లిన రాఘవేంద్రరావు
  • Share this:
సినీ దర్శకుడు రాఘవేంద్రరావుకు ఓటర్లు షాక్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో ఉన్న ఫిల్మ్ నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన ఆయన డైరెక్టుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లబోయారు. అయితే, అప్పటి వరకు అక్కడ క్యూలో నిలబడిన ఓటర్లు రాఘవేంద్రరావును అడ్డుకున్నారు. రాఘవేంద్రరావు అయితే, ఏంటి? క్యూలో రావాల్సిందే అంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో అలిగిన రాఘవేంద్రరావు ఓటు వేయకుండానే వెనుదిరిగారు. అయితే, రద్దీ తగ్గిన తర్వాత మళ్లీ ఆయన ఓటు వేసేందుకు రావొచ్చని ఆయన అనుచరులు భావిస్తున్నారు.

గత ఎన్నికల సమయంలో మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇలాంటి షాక్ తగిలింది. అందరూ క్యూలో నిలబడి ఉండగా, చిరంజీవి డైరెక్టుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లబోయారు. దీంతో ఓ ఎన్‌ఆర్ఐ ఆయన్ను ప్రశ్నించారు. చిరంజీవి అయినా సరే క్యూలో రావాల్సిందేనని చెప్పడంతో చేసేది లేక మెగాస్టార్ క్యూలో నిలబడి ఓటు వేశారు. అయితే, ఈ సారి రాఘవేంద్రరావుకు అలాంటి షాక్ తగిలింది. కానీ, దర్శకుడు మాత్రం అలిగి ఓటు వేయకుండా వెనక్కి వెళ్లిపోయారు.

First published: December 7, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading