Telangana Exit Poll 2018: ఎగ్జిట్ పోల్స్ ఎటువైపు... తెలంగాణ హీరో ఎవరు ?

LIVE Telangana Elections Exit Poll 2018: ఎగ్జిట్ పోల్స్‌లో ఆధిక్యత సాధించిన రాజకీయ పార్టీలే ఎక్కువగా అధికారంలోకి వచ్చిన దాఖలాలు ఉండటంతో... ఎగ్జిట్ పోల్స్ ఎవరికి పట్టం కడతాయనే అంశంపై ఆసక్తి నెలకొంది. ప్రీ పోల్ సర్వేలు ప్రజల నాడిని పట్టుకోవడంలో సఫలం కాకపోవడంతో అందరి చూపు ఎగ్జిట్ పోల్స్‌పైనే నెలకొంది.

news18-telugu
Updated: December 7, 2018, 6:10 PM IST
Telangana Exit Poll 2018: ఎగ్జిట్ పోల్స్ ఎటువైపు... తెలంగాణ హీరో ఎవరు ?
కేసీఆర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి..
news18-telugu
Updated: December 7, 2018, 6:10 PM IST
పోలింగ్ ముగిసింది. నిన్నటి వరకు తమకే ఓటు వేయాలంటూ ప్రజల వెంటపడ్డ రాజకీయ పార్టీలు... ఇప్పుడు వారిచ్చే తీర్పు కోసం ఎదురుచూస్తున్నాయి. ఓటరు తీర్పు ఈవీఎం మిషన్లలో నిక్షిప్తమై ఉండటంతో... ఫలితాలు వెలువడే 11వ తేదీ కోసం అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. అయితే ఎన్నికల ముగిసిన కొద్దిసేపటికే ఓటరు నాడి ఎలా ఉందో చెప్పేందుకు పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేందుకు సిద్ధమయ్యాయి. ఫలితాల కోసం 11వ తేదీ వరకు ఆగాల్సిన పని లేకుండానే... వాస్తవానికి దాదాపుగా దగ్గరగా ఉండే ఫలితాలను వెల్లడించే ఎగ్జిట్ పోల్స్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

ఎగ్జిట్ పోల్స్‌లో ఆధిక్యత సాధించిన రాజకీయ పార్టీలే ఎక్కువగా అధికారంలోకి వచ్చిన దాఖలాలు ఉండటంతో... ఎగ్జిట్ పోల్స్ ఎవరికి పట్టం కడతాయనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే ప్రీ పోల్ సర్వేల్లో ప్రజానాడి ఎవరికీ పూర్తిస్థాయిలో అంతుబట్టకపోవడంతో... మరోసారి ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు వాస్తవానికి దగ్గరగా ఉంటాయనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు గత ఎన్నికల్లో తెలంగాణలో ఏయే సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి. వాటిలో ఏవి వాస్తవానికి దగ్గరగా వచ్చాయనే విషయాన్ని ఓ సారి తెలుసుకుందాం.

2014 ఎగ్జిట్ పోల్స్

గత ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని దాదాపుగా అన్ని సంస్థలు తెలిపాయి. టీఆర్ఎస్-73. కాంగ్రెస్-24, టీడీపీ, బీజేపీ కూటమి-11, ఎంఐఎం-11 స్థానాలు వస్తాయని ఎన్డీటీవీ హంస ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. టీఆర్ఎస్-71, కాంగ్రెస్-23, టీడీపీ, బీజేపీ కూటమి-15, ఎంఐఎంతో పాటు ఇతరులకు-10 సీట్లు వస్తాయని టుడేస్ చాణక్య సంస్థ ఎగ్జిట్ పోల్స్ పేర్కొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ న్యూస్ ఛానెల్ టీవీ9 ఎగ్జిట్ పల్స్ టీఆర్ఎస్ 78-82, కాంగ్రెస్ 8-10, టీడీపీ, బీజేపీ కూటమి 26-33, ఎంఐఎంతో పాటు ఇతరులకు-13 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. మరో టీవీ ఛానెల్ ఎన్టీవీ టీఆర్ఎస్ 75-85, కాంగ్రెస్ 40-45, టీడీపీ, బీజేపీ కూటమి 20-25, ఎంఐఎంతో పాటు ఇతరులకు-3 స్థానాలు వస్తాయని చెప్పింది. ఇక మహా టీవీ సంస్థ టీఆర్ఎస్-57. కాంగ్రెస్-23, టీడీపీ-21, బీజేపీ-7, ఎంఐఎంతో పాటు ఇతరులకు 11 స్థానాలు వస్తాయని వెల్లడించింది.



2014 వాస్తవ ఫలితం
తెలంగాణలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్-63, కాంగ్రెస్-21, టీడీపీ-15, ఎంఐఎం-7, బీజేపీ-5, వైసీపీ-3, బీఎస్పీ-2, సీపీఐ-1, సీపీఎం-1, ఇతరులు-1 స్థానంలో గెలిచారు. టీఆర్ఎస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ స్పష్టంగా చెప్పినా... ఆ పార్టీ కచ్చితంగా ఎన్ని స్థానాలు గెలుస్తుందనే విషయాన్ని చాలా సంస్థలు పసిగట్టలేకపోయాయి.
Loading....
ఎగ్జిట్ పోల్స్ మొగ్గు ఎవరికి ?
టీఆర్ఎస్ హవా బలంగా ఉన్న సమయంలో ఆ పార్టీ కచ్చితంగా అధికారంలో వస్తుందని ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలన్నీ దాదాపుగా నిర్ధారించాయి. కానీ... ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. పలు ప్రీ పోల్ సర్వేలతో పాటు సోషల్ మీడియాలో సర్వేల పేరుతో అనేక రిపోర్టులు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని సర్వేలు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తాయని... మరికొన్ని మహాకూటమి వైపు మొగ్గు ఉందని తెలిపాయి. దీంతో ఎవరి సర్వే నిజమో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌లో అయినా ఒక స్పష్టత ఉంటుందా లేక అవి కూడా ఎన్నికల ముందు వచ్చిన సర్వేల తరహాలోనే ఉంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది.
First published: December 7, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Countdown
Countdown To Assembly Elections 2018 Results
  • 01 d
  • 12 h
  • 38 m
  • 09 s
To Assembly Elections 2018 Results