తెలంగాణ ఎన్నికలు: తొలి ఓటర్లకు సువర్ణావకాశం

సెలవులు మళ్లీ మళ్లీ వస్తాయి. కానీ ఎన్నికలు వచ్చేది ఐదేళ్లకు ఓసారి మాత్రమే. బాధ్యతగల యువత ఇది దృష్టిలో పెట్టుకొని ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్‌కు వస్తే దేశానికి అంతకుమించి ఇంకేం కావాలి. మీరు ఓటు వేసినప్పుడే మీ పాలకులను నిగ్గదీసి అడిగే హక్కు వస్తుంది. మీ ఓటు విలువ మీకు తెలుసు కాబట్టి పాలకుల తప్పుల్ని కడిగేయొచ్చు. అసలు మీరు ఎన్నికల్లో ఓటు వేయకుండానే వ్యవస్థను తిట్టడం కూడా సరికాదు.

Santhosh Kumar S | news18-telugu
Updated: December 6, 2018, 3:12 PM IST
తెలంగాణ ఎన్నికలు: తొలి ఓటర్లకు సువర్ణావకాశం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇప్పుడు తెలంగాణ అంతటా ఎన్నికల హడావుడే. ఓట్లు వేసేందుకు పౌరులంతా సంసిద్ధులవుతున్నారు. తొలిసారి ఓటు వేసేవాళ్లు మాత్రం చాలా ఉత్సాహంగా, ఆసక్తిగా పోలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో మొత్తం ఓటర్లు 2,73,18,603. ఇందులో సుమారు 5,75,000 లక్షల మంది కొత్త ఓటర్లే. అంటే తొలిసారి తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నవాళ్లు అన్నమాట. తొలి ఓటు వేసేందుకు యువతీయువకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలంగాణ ఎన్నికలు: తొలి ఓటర్లకు సువర్ణావకాశం | Telangana Assembly Elections 2018: Good opportunity for First time Voters
ప్రతీకాత్మక చిత్రం


18 ఏళ్లు నిండితే ఇండియాలో ఏమేం చేయొచ్చో తెలుసా? 18 ఏళ్లు అంటే మైనర్ నుంచి మేజర్‌గా మారడం. బ్యాంకులో అప్పటి వరకు మైనర్ అకౌంట్ ఉన్నా... 18 ఏళ్లు నిండగానే అకౌంట్‌ని పూర్తిస్థాయిలో నిర్వహించుకునే హక్కులు వస్తాయి. అంతేకాదు... డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందొచ్చు. వీటన్నిటితో పాటు దేశాన్ని నడిపించే నాయకులను ఎన్నుకునే అవకాశం కూడా వస్తుంది. ఇన్నాళ్లూ ఎన్నికలను బయట నుంచి మాత్రమే చూసినవాళ్లు ఇప్పుడు తొలిసారి పోలింగ్ కేంద్రాల్లో అడుగుపెట్టబోతున్నారు. తమను పాలించబోయే నాయకుల తలరాతల్ని మార్చబోతున్నారు.

తెలంగాణ ఎన్నికలు: తొలి ఓటర్లకు సువర్ణావకాశం | Telangana Assembly Elections 2018: Good opportunity for First time Voters
ప్రతీకాత్మక చిత్రం


7 డిసెంబర్ 2018... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు... తొలి ఓటు వేసేందుకు ఇదో సువర్ణావకాశం. అందుకే తెలంగాణలోని యువ ఓటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు ఇది. ఓటు పవర్ ఏంటో చూపించడానికి సిద్ధమవుతోంది యువత. తొలిసారి ఓటు వేస్తున్నామని ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓటు వేయడం అంటే రాకెట్ సైన్స్ చదవడమేమీ కాదు. అవసరమా అనుకొని పోలింగ్‌కు దూరం ఉండకూడదు. ఒకరిద్దరు ఓటు వేయకపోతే వచ్చే నష్టమేంటీ అనుకోవద్దు. ఎందుకంటే... ప్రతి ఓటూ కీలకమే. ఒక్క ఓటు కూడా నేతల భవిష్యత్తును తారుమారు చేయగలదు. అందుకే సెలవు దొరికింది కదా అని అనుకోవద్దు.

తెలంగాణ ఎన్నికలు: తొలి ఓటర్లకు సువర్ణావకాశం | Telangana Assembly Elections 2018: Good opportunity for First time Voters
ప్రతీకాత్మక చిత్రం


సెలవులు మళ్లీ మళ్లీ వస్తాయి. కానీ ఎన్నికలు వచ్చేది ఐదేళ్లకు ఓసారి మాత్రమే. బాధ్యతగల యువత ఇది దృష్టిలో పెట్టుకొని ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్‌కు వస్తే దేశానికి అంతకుమించి ఇంకేం కావాలి. మీరు ఓటు వేసినప్పుడే మీ పాలకులను నిగ్గదీసి అడిగే హక్కు వస్తుంది. మీ ఓటు విలువ మీకు తెలుసు కాబట్టి పాలకుల తప్పుల్ని కడిగేయొచ్చు. అసలు మీరు ఎన్నికల్లో ఓటు వేయకుండానే వ్యవస్థను తిట్టడం కూడా సరికాదు. పార్టీలు కూడా యువ ఓటర్లే తమ గెలుపోటముల్ని నిర్థారిస్తాయని నమ్ముతాయి. 2014 ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టింది కూడా యువ ఓటర్లే. 2019లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో సుమారు 15 కోట్ల మంది యువ ఓటర్లు కీలకం కానున్నారని అంచనా. కాబట్టి... మీ ఓటు ఎంత విలువైనదో తెలుసుకోండి. పోలింగ్‌లో పాల్గొని ఓటు వేసి అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగలో మీరూ భాగస్వాములు కండి.ఇవి కూడా చదవండి:

ఓటు వేస్తున్నారా? ఈవీఎం గురించి ఆసక్తికర విషయాలు

Telangana Elections 2018: ఎన్నికల సిరా చరిత్ర తెలుసా?

ఓటర్ ఐడీ లేదా? ఈ కార్డు ఉంటే ఓటు వేయొచ్చు
Published by: Santhosh Kumar S
First published: December 6, 2018, 3:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading