తెలంగాణ ఎన్నికలు : రైతులు ఎవరి పక్షం?

తెలంగాణలో ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తెచ్చినా, రైతులకు మేలే చేసే నిర్ణయాలు తీసుకున్నప్పుడే అసలైన సంక్షేమం, అభివృద్ధిని చూడగలం. కారణం తెలంగాలో రైతు కుటుంబాలు దాదాపు 58 లక్షలున్నాయి. జనాభాలో 80 శాతం మందికి వ్యవసాయమే ఆధారమైంది. కౌలు రైతులు 6 లక్షల మంది ఉండగా... ఓటు హక్కు ఉన్న రైతులు 1.5 కోట్ల మంది ఉన్నారు.

news18-telugu
Updated: November 28, 2018, 10:54 AM IST
తెలంగాణ ఎన్నికలు : రైతులు ఎవరి పక్షం?
రైతు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో అన్ని రంగాల కంటే వ్యవసాయం అత్యంత కీలకం అయ్యింది. పాలక పక్షం టీఆర్ఎస్ ఒకవైపు, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి మరోవైపు రైతుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి. ఆ ప్రాధాన్యంతోనే ఆయా పార్టీల అధినేతలు తమ తమ ప్రచార వ్యూహాల్ని రచిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోల్లో కూడా రైతు సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన ప్రజా కూటమి పార్టీలన్నీ రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నాయి. సోమవారం రిలీజైన ప్రజాకూటమి మేనిఫెస్టోలో రైతు సంక్షేమమే ప్రధానాంశం అయ్యింది. ఇప్పటికే రైతు బంధు లాంటి ఎన్నో పథకాల్ని తెచ్చిన టీఆర్ఎస్ కూడా, ఆ వర్గం ఓట్లపై గంపెడాశలు పెట్టుకుంది.

కనీస ఉమ్మడి ప్రణాళికను విడుదల చేస్తున్న ఎల్.రమణ, ఉత్తమ్, కోదండరాం,
కనీస ఉమ్మడి ప్రణాళికను విడుదల చేస్తున్న ఎల్.రమణ, ఉత్తమ్, కోదండరాం,


టీఆర్ఎస్ ప్రకటించబోతున్న మేనిఫెస్టోలో కూడా రైతులకు మరిన్ని సంక్షేమ పథకాల్ని చేర్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రజా కూటమి ప్రకటించిన వాటికంటే, కాస్త అదనంగా జోడిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు ఏడు దశాబ్దాలపాటూ దేశాన్ని ఏలిన కాంగ్రెస్, బీజేపీలు చెయ్యనివి తాము చేసి చూపిస్తున్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వనరుల్ని సరిగ్గా ఉపయోగించుకుంటే, అద్భుతమైన ఫలితాలు వస్తాయంటున్నారు.

telangana tdp releases election manifesto
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మేనిఫెస్టో విడుదల చేస్తున్న టీడీపీ నేతలు..
ప్రస్తుతం కేసీఆర్ తన ప్రచారంలో ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూనే... నీళ్లు, పొలాలు, పంటలు, రైతుల సంక్షేమంపై మాట్లాడుతున్నారు. జనాభాలో దాదాపు 80 శాతం మంది రైతులే ఉండటంతో వ్యవసాయ రంగంలో వివ్లవాత్మక మార్పులు తెస్తామంటున్నారు. రైతుల సంక్షేమమే టీఆర్ఎస్ ఎజెండా అని చెబుతున్నారు.

కేసీఆర్(ఫైల్ ఫోటో)
కేసీఆర్(ఫైల్ ఫోటో)


సంప్రదాయ వ్యవసాయ విధానాల్లో అత్యాధునిక పద్ధతుల్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నాయి అన్ని పార్టీలూ. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు అమ్ముకునేందుకు సబ్సిడీపై సంచార మార్కెటింగ్ వాహనాలు, పంట గిట్టుబాటు కాని సందర్భంలో, ప్రకృతి విపత్తుల వల్ల ఉత్పత్తులను అమ్ముకోలేని పరిస్థితుల్లో మద్దతు ధరలపై అదనంగా బోనస్ కూడా ఇస్తామని టీఆర్ఎస్, ప్రజాకూటమి హామీ ఇస్తున్నాయి. సబ్సిడీ బర్రెల పథకం, 90 శాతం సబ్సిడీపై గొర్రెల షెడ్ల పథకంతోపాటూ మరిన్ని రాయితీలు, సబ్సిడీలతో కూడిన పథకాల్ని కొనసాగిస్తూనే, మరిన్ని పథకాలు తేబోతున్నాయి.
maharashtra-farmers-fire-on-meteorological-department
ప్రతీకాత్మక చిత్రం


ప్రజాకూటమి ప్రధాన అంశాలు:
* ఏకకాలంలో రూ.2లక్షల వరకు రుణమాఫీ
* విత్తనం వేసే సమయంలోనే మద్దతు ధర
* ఆదాయ భద్రతకు రైతు కమిషన్
* రైతుబంధు కొనసాగింపు, కౌలు రైతులకూ వర్తింపు
* రైతు బీమా కొనసాగింపు, రైతు కూలీలకూ వర్తింపు
* ప్రైవేట్ అప్పులపై నియంత్రణకు మనీ వెండింగ్ చట్టం
* రూ.2వేల కోట్లతో విపత్తు, కరవు నిధి
* రూ.10 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
* 17 అంశాలతో వ్యవసాయాభివృద్ధికి అజెండా

Goa BJP government lauches vedic scheme for farmers chant mantra to get a better crop
ప్రతీకాత్మక చిత్రం


టీఆర్ఎస్ ప్రధాన అంశాలు:
* ఏకకాలంలో లక్ష రూపాయల వరకూ రుణమాఫీ
* రైతులకు ఉచితంగా 24 గంటలూ కరెంట్
* రైతు బంధుతో ఎకరాకు ఏటా 8 వేల పెట్టుబడి
* అధికారంలోకి వచ్చాక, 10 వేలకు పెంపు
* రైతు బీమా అమలు, కొనసాగింపు
* ప్రతి రైతు ఖాతాలో కనీసం రూ.5 లక్షలు నిల్వ
* కోటి ఎకరాలకు ఆయకట్టు వచ్చేలా ప్రణాళిక
* పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రయత్నం
* ఫూడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో రైతులు, మహిళలకు ఉపాధి
* కౌలు రైతులకూ జీవిత భీమా
* గిట్టుబాటు ధరల కోసం ప్రత్యేక పథకం

ఇవన్నీ గమనిస్తున్న రైతులు... హామీల అమలు సాధ్యాసాధ్యాల్ని ఆలోచిస్తున్నారు. ఇదివరకటి కంటే రైతుల్లో చైతన్యం పెరిగింది. వాళ్లు కూడా వాస్తవాల్ని గ్రహిస్తున్నారు. నిజంగా వ్యవసాయానికి మేలు చేసే ప్రభుత్వం ఏదో, దానికే ఓటు వేస్తామని చెబుతున్నారు.
First published: November 28, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు