Telangana Elections 2018: ఎన్నికల చరిత్ర... ఈ సిరాతో...

ఓటు వేయగానే ఎడమచేతి చూపుడు వేలుపై గుర్తు పెడతారు. సిరా గుర్తుపై ఎన్నికల సంఘం నిబంధనలు కూడా ఉన్నాయి. 37(1) నిబంధన ప్రకారం ఓటర్ ఎడమచేతి వేలుపై సిరా గుర్తును చూడాల్సిన బాధ్యత పోలింగ్ అధికారిది.

news18-telugu
Updated: March 29, 2019, 5:09 PM IST
Telangana Elections 2018: ఎన్నికల చరిత్ర... ఈ సిరాతో...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 29, 2019, 5:09 PM IST
తెలంగాణలో ఎన్నికల సందడి ఊపందుకుంది. జనమంతా ఓట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో పలు అంశాలపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఓటు వేసిన ప్రతీ ఒక్కరి ఎడమచేతి చూపుడు వేలిపై సిరా గుర్తు కనిపించడం మామూలే. ఎడమచేతి చూపుడు వేలు లేకపోతే ఏ వేలికైనా సిరా గుర్తు వేస్తారు. ఈ సిరా వెనుక ఓ పెద్ద చరిత్రే ఉంది. ఓటు వేసిన వ్యక్తి మళ్లీ ఓటు వేకుండా ఇలా సిరా గుర్తు పెట్టే పద్ధతి 1962 సార్వత్రిక ఎన్నికల్లో మొదలైంది. దొంగఓట్లు వేయకుండా కట్టడి చేసేందుకు సిరా గుర్తు పద్ధతి సత్ఫలితాలను ఇచ్చింది.

ఎన్నికల్లో ఉపయోగించే సిరా మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ ఫ్యాక్టరీలో తయారయ్యేది. ఈ ఫ్యాక్టరీని మైసూర్ మహరాజు కృష్ణరాజ వడయార్-4 1937లోనే స్థాపించారు. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే ఇంకునే దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో ఉపయోగిస్తున్నారు. ఈ సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉండటం వల్ల ఇంకు గుర్తు 3-4 రోజుల వరకు చెరిగిపోదు. అందుకే ఓటు వేయగానే ఎడమచేతి చూపుడు వేలుపై గుర్తు పెడతారు. సిరా గుర్తుపై ఎన్నికల సంఘం నిబంధనలు కూడా ఉన్నాయి. 37(1) నిబంధన ప్రకారం ఓటర్ ఎడమచేతి వేలుపై సిరా గుర్తును చూడాల్సిన బాధ్యత పోలింగ్ అధికారిది.

భారతదేశంలో తయారయ్యే ఈ ఎన్నికల సిరాకు ప్రపంచ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. 29 దేశాల్లో జరిగే ఎన్నికలకు ఇండియా నుంచి ఎగుమతి అవుతుందని అంచనా. మైసూర్‌లోనే కాదు... హైదరాబాద్‌లోని రాయుడు ల్యాబరేటరీస్‌లోనూ ఎన్నికల సిరా తయారవుతోంది. ఈ ఇంక్‌ను స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పిల్లలకు పోలియో డ్రాప్స్ వేసే సమయంలోనూ గుర్తుపెట్టేందుకు ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్‌లో తయారయ్యే సిరా కూడా ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇక తెలంగాణ ఎన్నికల కోసం రెండు లక్షల సిరా బాటిళ్లు సిద్ధం చేశారని అంచనా.

ఇవి కూడా చదవండి:



ఓటు వేస్తున్నారా? ఈవీఎం గురించి ఆసక్తికర విషయాలు

Telangana Election 2018: ఓటు మన బాధ్యత... ఇకనైనా వీడండి నిర్లిప్తత

ఓటర్ ఐడీ లేదా? ఈ కార్డు ఉంటే ఓటు వేయొచ్చు
Loading...
 
First published: December 6, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...