CM KCR: ఏకగ్రీవ పంచాయితీలకు సంబంధించి మేము అలా చెప్పలేదు.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ వెల్లడి..

అసెంబ్లీలో మాట్లాడుతున్న సీఎం కేీసీఆర్

శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో గ్రామ పంచాయితీల నిధులపై (Grama Panchayat Funds) ప్ర‌తిప‌క్షాలు మాట్లాడిన తీరును ముఖ్య‌మంత్రి కేసీఆర్ (CM KCR Comments In Assembly) త‌ప్పుబ‌ట్టారు.

  • Share this:
    గులాబ్‌ తుఫాను దృష్ట్యా మూడు రోజులపాటు గత మూడు రోజులుగా వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యాయి. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో గ్రామ పంచాయితీల నిధులపై (Grama Panchayat Funds) ప్ర‌తిప‌క్షాలు మాట్లాడిన తీరును ముఖ్య‌మంత్రి కేసీఆర్ (CM KCR Comments In Assembly) త‌ప్పుబ‌ట్టారు. గ్రామ పంచాయ‌తీల నిధులు దారి మ‌ళ్లింపు అనేది అవాస్తవం అని అన్నారు. పంచాయ‌తీరాజ్ చ‌ట్టంలో భాగంగానే జీవోలు జారీ చేశామ‌ని చెప్పారు. శాస‌న‌స‌భ‌లో (Telangana Assembly) కాంగ్రెస్‌ సభ్యుల మాటలు వింటే జాలేస్తోందని అన్నారు. తెలంగాణలోని గ్రామాలను చూసి పొరుగు రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచులు గౌరవంగా బతుకుతున్నారని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎన్నో పంచాయతీలు దివాళా తీశాయని ఆరోపించారు.

    కాంగ్రెస్‌ హయాంలో వ్యక్తిపై సగటున రూ.4 మాత్రమే ఖర్చు చేశారని, తమ హయాంలో రూ.650 విడుదల చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో సర్పంచ్‌లు ఎన్నో బాధలు, కష్టాలు పడ్డారని అన్నారు. కానీ ఇప్పుడు సర్పంచులకు ఎలాంటి బాధలు లేవని, చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. కరోనా సమయంలో (Coronavirus) ఎమ్మెల్యేల జీతాలు ఆపామని.. పంచాయతీలకు నిధులు కేటాయించడం మాత్రం ఆపలేదన్నారు. తెలంగాణలోని స‌ర్పంచ్‌ల‌ను కేంద్ర మంత్రులు ప‌లువురు ప్ర‌శంసించారని చెప్పారు.

    Telangana: గుడ్‌న్యూస్.. ప్రతి జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

    కేంద్రం నుంచి పంచాయితీలకు ఎన్ని నిధులు వస్తున్నాయో సభ్యులకు తెలియదా అని ప్రశ్నించారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే కేంద్రం నిధులు విడుదల చేస్తోందని చెప్పారు. కొన్ని చోట్ల వనరులు ఉంటాయని, మరికొన్ని చోట్ల వనరులు ఉండవని అన్నారు. తాము అన్ని పంచాయితీలకు సమన్యాయం జరగాలని ఆలోచిస్తున్నట్టుగా చెప్పారు.

    Post Office Scheme: రూ.50 వేలు డిపాజిట్ చేస్తే రూ.3,300 పెన్షన్.. పోస్టాఫీస్ పథకం ప్రయోజనాలివే..

    ఇక, ఏకగ్రీవమైన పంచాయితీలకు (Unanimous Panchayat) ప్రత్యేకంగా నిధులు ఇస్తామని చెప్పలేదని ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శాసనసభలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో 1,935 గ్రామ పంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవమైన పంచాయితీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రోత్సహక నిధులు కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. రూ. 193 కోట్లు రావాల్సి ఉండగా.. పెండింగ్‌లో ఉందని సమాచారం ఉంది. అవి పెండింగ్‌లో ఉంటే ఉన్నాయని చెప్పండి, లేకపోతే క్లియర్ చేస్తే ఇచ్చేసామని చెప్పండి. లేదా మేము ఇవ్వడం లేదని చెప్పండి’ అని అడిగారు. దీనిపై స్పందించిన కేసీఆర్.. తాము ఎప్పుడూ చేసిన ధైర్యంగా చేస్తామని అన్నారు. అన్నమాటను గ్యారెంటీగా చేస్తామని తెలిపారు. కానీ ఏకగ్రీవమైన గ్రామ పంచాయితీలకు నిధులు ఇస్తామని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. అది తమ పాలసీలో లేదని వెల్లడించారు. నూతన పంచాయితీ రాజ్ చట్టంలో ఆ విషయం లేదని చెప్పారు. ఆ చట్టం ప్రకారమే నిధుల పంపిణీ, విడుదల జరుగుతుందన్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: