తెలంగాణ 2019-20 బడ్జెట్ రూ. 1,46,492.30 కోట్లు

తెలంగాణ పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ 2019-20ని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక మందగమనం ప్రభావం రాష్ట్ర బడ్జెట్‌పై కూడా ఉందని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: September 9, 2019, 12:07 PM IST
తెలంగాణ 2019-20 బడ్జెట్ రూ. 1,46,492.30 కోట్లు
తెలంగాణ రాష్ట్రం
  • Share this:
తెలంగాణ పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ 2019-20ని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ. 1,46,492.30 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1,11,055.84 కోట్లు కాగా, మూలధన వ్యయం వ్యయం రూ. 17,274.67 కోట్లు. బడ్జెట్‌లో రెవెన్యూ మిగులు రూ. 2,044.08 కోట్లుగా చూపించారు. బడ్జెట్‌లో ఆర్థిక లోటును 24,081 కోట్లుగా పేర్కొన్నారు. ప్రతి నెల గ్రామ పంచాయతీలకు రూ. 339 కోట్లు కేటాయించనున్నట్టు సీఎం కేసీఆర్ బడ్జెట్‌లో ప్రకటించారు. రైతు బంధు కోసం రూ. 12,000 కోట్లు కేటాయించారు. పంట రుణాల మాఫీ కోసం రూ. 6,000 కోట్లు కేటాయించినట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

రైతు బీమా ప్రీమియం చెల్లింపు కోసం రూ. 1,137 కోట్లు కేటాయించారు. ఆసరా పెన్షన్లు కోసం రూ. 9402 కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అందిన నిధులు రూ. 31,802 కోట్లు అని సీఎం కేసీఆర్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. కేంద్రం నుంచి అదనంగా ఒక్క రూపాయి అందలేదని అన్నారు. విద్యుత్ సబ్సిడీ కోసం బడ్జెట్‌లో రూ. 8,000 కోట్లు కేటాయించారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ. 1, 764 కోట్లు కేటాయించారు. ఆరోగ్య శ్రీకి రూ. 1336 కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఆర్థిక మాంద్యం కారణంగా ఆదాయం తగ్గినా పరిస్థితి మెరుగ్గానే ఉందని కేసీఆర్ అన్నారు.


First published: September 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...