Home /News /politics /

TELANGANA AMIT SHAH FIRES TRS AND CONGRESS IN TELANGANA ELECTION CAMPAIGN AK

టీఆర్ఎస్, కాంగ్రెస్ కుటుంబ పార్టీలు: అమిత్ షా

అమిత్ షా ( ట్విట్టర్ ఇమేజ్)

అమిత్ షా ( ట్విట్టర్ ఇమేజ్)

అసదుద్దీన్ ఓవైసీ అంటే కేసీఆర్‌కు భయమని... ఈ కారణంగానే ఆయన తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదని ధ్వజమెత్తారు. మోదీయే మళ్లీ ప్రధాని కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు.

    కాంగ్రెస్, టీఆర్ఎస్‌లపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో 16 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ ప్రధాని కాగలుతారా ? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత మంత్రివర్గ విస్తరణకే కేసీఆర్ మూడు నెలల సమయం తీసుకున్నారని... అలాంటి వ్యక్తి నుంచి ఇంకా ఏం ఆశిస్తామని ప్రశ్నించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు కుటుంబ పార్టీలే అని అమిత్ షా మండిపడ్డారు. టీఆర్ఎస్‌లో కేసీఆర్ తరువాత స్థానం ఎవరితో అందరికీ తెలుసని అన్నారు. తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి లేకున్నా... ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో నిధులు విడుదల చేశామని అమిత్ షా తెలిపారు.




    అసదుద్దీన్ ఓవైసీ అంటే కేసీఆర్‌కు భయమని... ఈ కారణంగానే ఆయన తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదని ధ్వజమెత్తారు. మోదీయే మళ్లీ ప్రధాని కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ చేసిందేమీలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెడతామని... అక్రమంగా దేశంలో ఉంటున్న చొరబాటుదారుల ఆటకటిస్తామని అన్నారు. సైనికులు చేపట్టిన సర్జికల్ స్ట్రైయిక్స్‌ను సైతం కేసీఆర్ అవమానించారని అమిత్ షా ధ్వజమెత్తారు.

    First published:

    Tags: Amit Shah, Bjp, Congress, Lok Sabha Election 2019, Telangana Lok Sabha Elections 2019, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు