హోమ్ /వార్తలు /National రాజకీయం /

Paddy buying: ధాన్యాన్ని ధాన్యంలా కొనాలి.. గోధుమల సేకరణ అంటే పిండి కొంటారా? కేంద్రంపై వ్యవసాయ శాఖ మంత్రి ధ్వజం

Paddy buying: ధాన్యాన్ని ధాన్యంలా కొనాలి.. గోధుమల సేకరణ అంటే పిండి కొంటారా? కేంద్రంపై వ్యవసాయ శాఖ మంత్రి ధ్వజం

మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(ఫైల్ ఫొటో)

మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(ఫైల్ ఫొటో)

ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని.. రైతులను అడ్డం పెట్టుకుని కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నేతలు​ విమర్శించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (singireddy niranjanreddy) కేంద్రంపై మండిపడ్డారు. 

ఇంకా చదవండి ...

  ధాన్యం కొనుగోలు (Paddy buying) అంశం తెలంగాణ (Telangana)లో తీవ్ర రాజకీయ రగడకు దారి తీస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తున్నట్లుగానే తెలంగాణ (Telangana)లో ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. అయితే అన్ని రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందం మేరకు కేంద్రం బియ్యాన్ని మాత్రమే సేకరిస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పంజాబ్ నుంచి కూడా బియ్యాన్నే సేకరిస్తున్నామని.. నేరుగా ధాన్యాన్ని కేంద్రం సేకరించబోదని పీయూష్ గోయల్ అన్నారు. తమకు పంజాబ్ అయినా తెలంగాణ అయినా ఒక్కటే అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని.. రైతులను అడ్డం పెట్టుకుని కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (singireddy niranjanreddy) కేంద్రంపై మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో తోటి మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై విరుచుకుపడ్డారు.

  ''పాడిందే పాట పాసుపండ్ల దాసు అన్నట్లు కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీ (PM modi) వైఖరి ఉంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దుర్మార్గపూరితంగా మాట్లాడారు. మాకంటే ముందే ఆయన మీడియా వద్దకు ఆతృతగా వచ్చి తెలంగాణ Telangana) ప్రభుత్వం రైతులను తప్పుదారి పట్టిస్తుందని చెప్పడం సిగ్గుచేటు. పండిన పంట కొనుగోలు బాధ్యత అంతా కేంద్రానిదే. కేంద్రానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు. ధాన్యం సేకరణకు, పప్పు దినుసుల సేకరణకు తేడా కేంద్రానికి తెలియడం లేదు. కేంద్రం ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనుకోవడం అవివేకం. వడ్లను వడ్ల లాగా సేకరించాలి. గోధుమల సేకరణ అంటే గోధుమ పిండి సేకరిస్తారా? బీజేపీకే తెలివి ఉంది... ఇతరులకు లేనట్లు భావిస్తున్నారు '' అని తెలిపారు.

  ''దేశ రైతులను రోడ్డు మీద నిలబెట్టి దాదాపు 700 మంది చావుకు కారణమయ్యింది ఈ సిగ్గులేని బీజేపీ ప్రభుత్వం. చివరకు ప్రధాని రైతులకు చేతులెత్తి మొక్కి క్షమాపణ చెప్పింది నిజం కాదా? తెలంగాణ బీజేపీ సన్నాసులు మేం కొనిపిస్తాం... మీరు వరి వేయండి అని రైతులను రెచ్చగొట్టారు. ఇప్పుడేమో ఉలుకూ పలుకూ లేదు. కేంద్రం గురించి తెలుసుకాబట్టే తెలంగాణ రైతులకు మేము విజ్ఞప్తి చేసి 50 లక్షల ఎకరాల వరి సాగును 30 లక్షలకు తగ్గించాం'' అని మంత్రి పేర్కొన్నారు.

  '' బీజేపీకి అధికారం లేని చోట ఇతర పార్టీల ప్రభుత్వాలను కేంద్రంలోని ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నది. అబద్దాలతో బీజేపీ అధికారంలోకి వచ్చింది . వారి మేనిఫెస్టోను చూస్తేనే ఈ విషయం బోధపడుతుంది ఈ దేశంలో ప్రజలను అన్ని విషయాలలో కేంద్రం మోసం చేసింది. తెలంగాణ ప్రజలకు, దేశ రైతాంగానికి కేంద్రం క్షమాపణ చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుంది. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమాఖ్య స్ఫూర్తి లేదని, కేంద్రం వివక్ష చూపుతుందని 2013లో రైతులతో సమావేశం పెట్టారు. ఈ రోజు అదే సమాఖ్య స్ఫూర్తిని మోదీ నాయకత్వంలోని కేంద్రం దెబ్బ తీస్తున్నది. ఈ దేశ జీడీపీ పెంపుదలలో కేంద్రం విఫలమయింది. ఈ దేశంలో నిరుద్యోగం నియంత్రించడంలో కేంద్రం విఫలమయింది. ఇన్నేళ్లలో మోదీ పాలనలో ఎలాంటి నూతనత్వం లేదు'' అని వ్యవసాయ మంత్రి ఆరోపించారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Paddy, Telangana, Trs

  ఉత్తమ కథలు