జేపీ నడ్డా ఆరోపణలకు మంత్రి కౌంటర్...బీజేపీకి సూటి ప్రశ్న...

కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ దందాలకు పాల్పడ్డారంటూ బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా చేసిన ఆరోపణలను మంత్రి నిరంజన్ రెడ్డి తోసిపుచ్చారు.

news18-telugu
Updated: August 19, 2019, 4:37 PM IST
జేపీ నడ్డా ఆరోపణలకు మంత్రి కౌంటర్...బీజేపీకి సూటి ప్రశ్న...
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
టీఆర్ఎస్ సర్కారుపై బీజేపీ సీనియర్ నేత జేపీ నడ్డా చేసిన విమర్శలను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తిప్పికొట్టారు. హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన పార్టీ బహిరంగ సభలో కాళేశ్వరం ప్రాజెక్టులో టీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడ్డారని బీజేపీ నేతలు నిరాధారణ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బేగంపేటలోని హోటల్‌ హరిత ప్లాజాలో 'రైతు మార్గదర్శి' పుస్తకాన్ని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనతోనే రైతుబంధు, రైతుబీమా పథకాలు వచ్చాయని, దీన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని వ్యాఖ్యానించారు.

తెలంగాణ‌లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు అద్భుతమని నీతి ఆయోగ్‌ కితాబు ఇచ్చిందని మంత్రి గుర్తుచేశారు. రాష్ర్టానికి రూ.24వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ కేంద్రానికి సూచించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌ సర్కారుకే దక్కిందన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో లక్షల ఎకరాలకు సాగు నీరందే ప్రాజెక్టు ఎక్కడైనా నిర్మించిందా? అని సూటిగా ప్రశ్నించారు. టీఆర్ఎస్ సర్కారుపై ఇష్టారాజ్యంగా బీజేపీ నేతలు విమర్శలు చేయడం సరికాదని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు