TELANGAN CM KCR HOPES ON GOVT EMPLOYEES AND TRS GRAGDUATE CADRE TO WIN MLC ELECTIONS BA
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం ‘బ్రహ్మాస్త్రం’ వదిలిన టీఆర్ఎస్
సీఎం కేసీఆర్
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బ్రహ్మోస్త్రం వదిలింది. తెలంగాణలో హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ , వరంగల్ - నల్లగొండ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం ఓ ముఖ్యమైన ఆయుధాన్ని సంధించారు సీఎం కేసీఆర్.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బ్రహ్మోస్త్రం వదిలింది. తెలంగాణలో హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ , వరంగల్ - నల్లగొండ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం ఓ ముఖ్యమైన ఆయుధాన్ని సంధించారు సీఎం కేసీఆర్. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు కీలకం. అందుకే వారిని ఆకట్టుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రటకన చేశారు. ఉద్యోగుల పీఆర్సీ పెంపు విషయంలో సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలంగాణ ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఇస్తున్న పీఆర్సీ కంటే ఎక్కువ ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని అన్నారు. సీఎం కేసీఆర్తో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం అయ్యారు. 29 శాతం ఫిట్ మెంట్ ఇస్తామని కేసీఆర్ వారికి హామీ ఇచ్చినట్టు తెలిసింది. అలాగే, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. ఎన్నికల నియమావళికి లోబడే తాము సీఎం కేసీఆర్తో సమావేశమైనట్లు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఉద్యోగుల పదోన్నతలు కూడా త్వరగానే ఇచ్చారని తెలిపారు.
పీఆర్సీ విషయంలో సీఎం కేసీఆర్ చాలా క్లారిటీ ఇచ్చారని.. తమకు కేసీఆర్పై నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కోడ్ ఉండటం వల్లే దీనిపై ప్రకటన చేయలేకపోతున్నట్టు సీఎం కేసీఆర్ తమకు చెప్పినట్టు తెలిపారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పీఆర్సీపై ప్రకటన వస్తుందని అన్నారు. 2014 తర్వాత దేశంలోనే తెలంగాణలో సీఎం కేసీఆర్ అత్యధిక పీఆర్సీ ఇచ్చారని నేతలు గుర్తు చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపును కూడా త్వరలోనే అమలు చేస్తామని సీఎం కేసీఆర్ తమకు చెప్పారని నేతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగులను తెలంగాణకు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ అంగీకరించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ స్కీమ్ అమలు విషయంలోనూ సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు.
హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణి దేవి పోటీ చేస్తున్నారు. ఇక వరంగల్ - నల్లగొండ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన పల్లా రాజేశ్వర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ రెండు చోట్లా ఉద్యోగుల ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. కేసీఆర్ నిర్ణయంతో ఆ ఓట్లన్నీ గంపగుత్తగా టీఆర్ఎస్ పార్టీకి పడతాయని ఆశిస్తున్నారు. అలాగే, ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి 2 లక్షల మంది పార్టీ సభ్యత్వం ఉన్న గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వారి ఓట్లు కూడా కలుపుకొంటే గెలుపు సాధ్యమేనని ఆశిస్తున్నారు. మార్చి 14న పోలింగ్ జరగనుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.