తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త కృష్ణుడు... రేసులో మాజీ సీఎం...

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు కొత్త ఇంఛార్జ్ రానున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: December 2, 2019, 3:32 PM IST
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త కృష్ణుడు... రేసులో మాజీ సీఎం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వచ్చే ఎన్నికల్లో అయినా తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ... త్వరలోనే టీ పీసీసీ చీఫ్‌ను మార్చబోతున్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. టీపీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వం... టీపీసీసీ చీఫ్ మార్పుతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా కొత్తవారిని నియమించాలని యోచిస్తోంది. కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్‌కు కుంతియా ఇంఛార్జ్‌గా ఉన్నారు. అయితే ఆయన దిశానిర్ధేశంలో కాంగ్రెస్ పెద్దగా విజయాలు సాధించలేదు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చేలా కాంగ్రెస్ వ్యూహాలు రచించడంలో కుంతియా ఫెయిలయ్యారనే టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే టీ పీసీసీ చీఫ్ మార్పుతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్‌ను కూడా మార్చాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ... ఇందుకోసం ఒకరిద్దరు పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ముందుగా మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ ఉన్నట్టు టాక్. ఆయన కాదంటే... మాజీ కేంద్రమంత్రి స్థాయి వ్యక్తిని ఈ పోస్టులో నియమించాలని పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. మొత్తానికి తెలంగాణలో టీ పీసీసీ చీఫ్ మార్పుతో పాటు దిశానిర్దేశం చేసేందుకు కొత్త కృష్ణుడు కూడా రానున్నట్టు తెలుస్తోంది.


First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>