తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. సరిగ్గా 5 గంటలకు మైక్‌లు మూగబోయాయి. ఏడో తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఏడో దేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎలాంటి బల్క్ మెసేజ్‌లు పంపకూడదని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో అన్ని పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి 1821 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అందులో వివిధ పార్టీల నుంచి 515, ఇండిపెండెంట్లు 1306 మంది పోటీలో ఉన్నారు.
Read More