టీఆర్ఎస్ గెలిస్తే కాళేశ్వరం, చంద్రబాబు గెలిస్తే శనీశ్వరం: గజ్వేల్‌లో కేసీఆర్

Telangana Elections 2018: దొంగ సర్వేలు వస్తాయని, వాటి గురించి ఆందోళన చెందవద్దని కేసీఆర్ భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: December 5, 2018, 4:13 PM IST
టీఆర్ఎస్ గెలిస్తే కాళేశ్వరం, చంద్రబాబు గెలిస్తే శనీశ్వరం: గజ్వేల్‌లో కేసీఆర్
గజ్వేల్ సభలో ప్రసంగిస్తున్న కేసీఆర్
  • Share this:
తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి వస్తే కీలుబొమ్మ ప్రభుత్వంలా మారుతుందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అలాంటి ప్రభుత్వం రావాలని చంద్రబాబు కోరుకుంటున్నారని కేసీఆర్ ఆరోపించారు. దద్దన్నలు, మొద్దన్నలు ఉంటే గోల్ మాల్ చేయొచ్చనేది చంద్రబాబు ప్లాన్ అని కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఆంధ్రా నుంచి వేల కోట్ల రూపాయలను, ఇంటెలిజెన్స్‌ అధికారులను, మనుషులను రంగంలోకి దించారని కేసీఆర్ ఆరోపించారు. డబ్బులతో కొనొచ్చని చంద్రబాబు ప్లాన్ చేశారని, ఆయనకు బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉంటే, వారి ఆటలు సాగవని, అందుకే కాంగ్రెస్‌ను వెంటేసుకుని వచ్చారని మండిపడ్డారు. కేసీఆర్ దెబ్బకొడితే వెళ్లి చంద్రబాబు కరకట్టలోపడ్డారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎన్నికల చివరి రోజు కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కు అధికార లాలస. అధికారం లేకపోతే వారు బతకలేరు. నాకు మరోసారి అవకాశం ఇవ్వండి. నా కంఠంలో ప్రాణం ఉండగా తెలంగాణను బానిసను కానివ్వను. టీఆర్ఎస్ గెలిస్తే కాళేశ్వరం, చంద్రబాబు గెలిస్తే శనీశ్వరం. మనలో మనకి విబేధాలు ఉంటే పరిష్కారం చేసుకుందాం. కానీ, వలస శక్తులకు అవకాశం ఇవ్వొద్దు. చంద్రబాబునాయుడు పెత్తనం నడిచే ప్రభుత్వం రావొద్దు. ఢిల్లీ గులాముల ప్రభుత్వం రావొద్దు. దరఖాస్తు పట్టుకుని విజయవాడ వెళ్లే పరిస్థితి రావొద్దు.

గజ్వేల్ సభలో కేసీఆర్


కోదాడ సభలో చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ తప్పుపట్టారు. ‘కృష్ణాలో నీళ్లు లేవు, గోదావరి నీళ్లు పంచుకుందాం.’ అని చంద్రబాబు కోదాడ సభలో అంటుంటే, దానికి కాంగ్రెస్ గొర్రెలు తల ఊపుతున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. మాయమాటలు చెబుతున్న ప్రజాకూటమికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని కేసీఆర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

దొంగ సర్వేలు వస్తాయని, వాటి గురించి ఆందోళన చెందవద్దని కేసీఆర్ భరోసా ఇచ్చారు. 119 నియోజకవర్గాల్లో పర్యటించిన తాను ధైర్యంగా చెబుతున్నానని, టీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్‌లో కేసీఆర్ గెలవడం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమన్నారు. వచ్చే ఐదేళ్లలో గజ్వేల్ నియోజకవర్గంలో ఇల్లు లేని కుటుంబం ఉండకూడదన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 5, 2018, 4:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading