మంత్రి పదవి బిక్ష కాదు... తెలంగాణ మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు

తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌లో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: August 29, 2019, 6:22 PM IST
మంత్రి పదవి బిక్ష కాదు... తెలంగాణ మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు
ఈటెల రాజేందర్ ఫైల్ ఫోటో
  • Share this:
తెలంగాణ కేబినెట్ నుంచి తనను తప్పిస్తారని వస్తున్న ఊహాగానాలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన మంత్రి ఈటల రాజేందర్... తాజాగా తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌లో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తననపై జరుగుతున్న చిల్లర ప్రచారంపై సమాధానం చెప్పాల్సిన పని లేదని అన్నారు.15 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఏ ఒక్కరి నుంచి 5 రూపాయలు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఈటల అన్నారు. మంత్రి పదవి బిక్ష కాదని... తాను బీసీని కాబట్టి కుల ప్రాతిపదికన మంత్రి పదవి కావాలని ఎప్పుడూ అడగలేదని స్పష్టం చేశారు.

తెలంగాణ ఆత్మగౌరవం కోసం తాను పోరాటం చేశానని... ఉద్యమంలో మూడున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుటా ఎగురవేశానని వ్యాఖ్యానించారు. తనను చంపాలనే ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా తెలంగాణ జెండా వదల్లేదని అన్నారు. తాను పార్టీలోకి మధ్యలో వచ్చినోన్నీ కాదని,.బతికొచ్చినోన్నీ కాదని ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము గులాబీ జెండా ఓనర్లమని, అడుక్కొనే వాళ్ళం కాదని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, ధర్మం, న్యాయం మాత్రమే శాశ్వతమని ఈటల తెలిపారు. నాయకులు చరిత్ర నిర్మాతలు కాదని, ప్రజలే చరిత్ర నిర్మాతలు అని ఈటల అన్నారు.కుహనావాదుల పట్ల, కుసంస్కారుల పట్ల, సొంతగా ఎదగలేని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యానించారు. ధర్మం, న్యాయం ముందు ఎవరు తప్పించుకోలేరని... ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష తప్పదని ఈటల రాజేందర్ అన్నారు.First published: August 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>