కొత్తపార్టీ పెట్టిన లాలూ పెద్దకొడుకు..బీహార్‌లో ఆర్జేడీకి అగ్నిపరీక్ష

లోక్‌సభ ఎన్నికల్లో 18 స్థానాల్లో లాలూ రబ్రీ మోర్చా పోటీచేసే అవకాశమున్నట్లు సమాచారం.

news18-telugu
Updated: April 1, 2019, 8:35 PM IST
కొత్తపార్టీ పెట్టిన లాలూ పెద్దకొడుకు..బీహార్‌లో ఆర్జేడీకి అగ్నిపరీక్ష
తేజ్ ప్రతాప్
  • Share this:
ఎన్నికలవేళ రాష్ట్రీయ జనతాదళ్ (RJD)లో రచ్చ మొదలైంది. ఆధిపత్య పోరుతో కుటుంబ కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. లాలూ ప్రసాద్ యాదవ్ జైలుపాలయ్యాక పార్టీ బాధ్యతలు చూస్తున్న తేజస్వియాదవ్‌కు సోదరుడు తేజ్ ప్రతాప్ గట్టి షాక్‌ఇచ్చారు. తన వర్గీయులకు టికెట్‌లు ఇవ్వనందుకు ఏకంగా సొంతపార్టీ పెట్టారు. 'లాలూ రబ్రీ మోర్చా' పేరుతో కొత్త పార్టీ పెడుతున్నట్లు సోమవారం ప్రకటించారు. తండ్రి (లాలూ ప్రసాద్ యాదవ్), తల్లి (రబ్రీ దేవి)పేరు వచ్చేలా పార్టీకి నామకరణం చేశారు.

పురాణాల్లో పాండవులు ఐదు గ్రామాలు అడిగినట్లే నేను కూడా రెండు ఎంపీ సీట్లు అడిగా. కానీ ఇప్పటి వరకు సమాధానం రాలేదు. తేజస్వి చుట్టూ భజన బృందం చేరింది. వారి మాటలు విని మా తమ్ముడు నాకు వ్యతిరేకంగా మారిపోయాడు. అందుకే లాలూ రబ్రీ మోర్చాను స్థాపిస్తున్నా.
తేజ్ ప్రతాప్ యాదవ్
టికెట్ల విషయంలో అన్నాదమ్ముళ్ల మధ్య విభేదాలు తలెత్తాయి. తన వర్గీయులకు రెండు టికెట్లు ఇవ్వాలని తేజ్ ప్రతాప్ కోరగా..అందుకు తేజస్వి యాదవ్ నిరాకరించారు. అంతేకాదు తేజ్‌ప్రతాప్‌కు బద్ధశత్రువైన పిల్లినిచ్చిన మామ చంద్రికారాయ్‌కు కేటాయించారు. విడాకుల విషయంలో తన అత్తింటివారికి తేజ్‌ప్రతాప్‌కు పడడం లేదు. కానీ తేజస్వియాదవ్ వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో తేజ్‌ప్రతాప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే సొంతకుంపటి పెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో 18 స్థానాల్లో లాలూ రబ్రీ మోర్చా పోటీచేసే అవకాశమున్నట్లు సమాచారం.

First published: April 1, 2019, 8:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading