కర్నూలు జిల్లాలో వైసీపీ, టీడీపీ వర్గాల ఘర్షణ... వేటకొడవళ్లతో దాడులు..

వైసీపీ ఎమ్మెల్యే బాలనాగారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి తిక్కారెడ్డి వర్గాలు వేటకొడవళ్లు, కత్తులు, కర్రలతో దాడులు చేసుకున్నారు.

news18-telugu
Updated: July 31, 2020, 3:32 PM IST
కర్నూలు జిల్లాలో వైసీపీ, టీడీపీ వర్గాల ఘర్షణ... వేటకొడవళ్లతో దాడులు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీకి చెందిన వర్గీయులు ఘర్షణ పడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే బాలనాగారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి తిక్కారెడ్డి వర్గాలు వేటకొడవళ్లు, కత్తులు, కర్రలతో దాడులు చేసుకున్నారు. మంత్రాలయం నియోజకవర్గంలోని హనుమాపురంలో పెద్ద అయిలప్ప, పెద్దయ్య మధ్య భూ వివాదం ఉంది. ఇద్దరూ చెరో పార్టీలో ఉన్నారు. టీడీపీకి చెందిన వర్గం పొలం దున్నడానికి వెళ్లగా, వారిని అవతలివారు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదంతో మొదలై ఘర్షణ పెరిగింది. ఇరు వర్గాలు కత్తులు, కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఇందులో పెద్ద అయిలప్ప కుటుంబంలో 11 మందికి, పెద్దయ్య కుటుంబంలో ఆరుగురికి గాయాలయ్యాయి. బాధితులను ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. రెండు వర్గాలకు రక్తస్రావం అయింది. అయితే, ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. అయితే, ఆస్పత్రి వద్ద కూడా రెండు గ్రూపులు గొడవ పడ్డాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 31, 2020, 3:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading