• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • TDP WILL SURVIVE ONLY IF JR NTR TAKES CHARGE NO USE WITH LOKESH AND CHANDRABABU MINISTER BALINENI COMMENTS HSN

Chandrababu- Jr NTR: టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కు ఇస్తే.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర కామెంట్స్..

మంత్రి బాలినేని, జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఫొటోలు)

‘చంద్రబాబు గారూ, జూనియర్ ఎన్టీఆర్ ను కుప్పానికి ప్రచారానికి తీసుకురండి‘.. ఇది కుప్పం పర్యటనలో ఉన్నప్పుడు స్వయంగా చంద్రబాబును ఓ కార్యకర్త కోరిన కోరిక. ‘రాజకీయాల్లోకి ఎప్పుడు రాబోతున్నారు‘.. ఇది ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కు..

  • Share this:
    ‘చంద్రబాబు గారూ, జూనియర్ ఎన్టీఆర్ ను కుప్పానికి ప్రచారానికి తీసుకురండి‘.. ఇది కుప్పం పర్యటనలో ఉన్నప్పుడు స్వయంగా చంద్రబాబును ఓ కార్యకర్త కోరిన కోరిక. ‘రాజకీయాల్లోకి ఎప్పుడు రాబోతున్నారు‘.. ఇది ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ కు విలేకరులు సంధించిన ప్రశ్న. కార్యకర్త అడిగిన కోరికకు మౌనమే చంద్రబాబు సమాదానం కాగా, ఇటు ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడూ చెప్పే విధంగానే ‘ఆ ప్రశ్నకు స్పందించడానికి ఇది వేదిక కాదు. సమయం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం‘ అంటూ కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ సీనియర్ నేత ‘టీడీపీ బతికి బట్టకట్టాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే‘ అని తేల్చిచెబుతున్నారు. ఆయన టీడీపీ నేత అనుకుంటే పొరపాటే. అధికార పార్టీ వైసీపీ నేత, మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

    ‘మున్సిపల్ ఎన్నికలతో తెలుగు దేశం పార్టీ ఏపీలో ఖతం అయిపోయింది. టీడీపీ పూర్తిగా చచ్చిపోయింది. కాస్తయినా టీడీపీ నిలదొక్కుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే అది సాధ్యం అవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే గుంటూరు, కృష్టా ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేశారని ఇక్కడి ప్రజలకు అర్థం అయిపోయింది. అందుకే టీడీపీ కుయుక్తులను గ్రహించే వైసీపీని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. లోకేష్ వల్ల టీడీపీకి ఎలాంటి లాభం ఉండదు. చంద్రబాబు పని కూడా అయిపోయింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే టీడీపీ కార్యకర్తలకు ఆశాదీపంలా కనిపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీని అంటి పెట్టుకుని ఉన్న కార్యకర్తలు కూడా వైసీపీలో చేరుతున్నారు‘ అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ కామెంట్స్ చేశారు.
    ఇది కూడా చదవండి: చేయని నేరానికి 20 ఏళ్లు జైల్లోనే మగ్గిపోయిన విష్ణు.. 43 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యాక ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే..

    ఏపీలో ఆదివారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన సంగి తెలిసిందే. ఇటు కృష్టా జిల్లా నుంచి అటు శ్రీకాకుళం వరకు, అన్ని జిల్లాల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఒకటి రెండు చోట్ల మాత్రమే టీడీపీ కొద్ది పాటి స్థానాలనయినా దక్కించుకుని ఆయా జిల్లాల్లో పరువు నిలబెట్టుకుంది. చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేసినా, బాలయ్య, లోకేష్ కూడా ప్రచార బరిలోకి దిగినా ఎన్నికల్లో ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో టీడీపీ భవిష్యత్తుపై ఆ పార్టీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. టీడీపీకి పూర్వవైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందేనన్న కామెంట్స్, పోస్టులు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కానీ, జూనియర్ మాత్రం ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగానే ఉండాలన్న నిర్ణయంలో ఉన్నట్టు తెలుస్తోంది.
    ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!
    Published by:Hasaan Kandula
    First published: