టీడీపీకి మరో షాక్... పార్లమెంట్‌లో ఆ గది ఖాళీ

సెప్టెంబర్ మొదటి వారంలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అయితే కరోనా కారణంగా ఈసారి పార్లమెంట్‌లో సీటింగ్ విధానం మారనుంది.

వైసీపీ ఎంపీల విజ్ఞప్తి మేరకు పార్లమెంట్‌లోని 5వ నెంబర్ గదిని వైసీపీకి కేటాయిస్తూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు.

  • Share this:
    టీడీపీకి పార్లమెంట్‌లో ఊహించని షాక్ తగిలింది. గత 30 ఏళ్లుగా పార్లమెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని 5వ నెంబర్ గది నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న టీడీపీ... తాజాగా ఆ ఆఫీసు ఖాళీ చేయాల్సి వచ్చింది. వైసీపీ ఎంపీల విజ్ఞప్తి మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా... ఈ గదిని ఆ పార్టీకి కేటాయించారు.ఇక మూడో అంతస్తులోని 118 నెంబర్ గదికి టీడీపీ కార్యాలయాన్ని తరలించారు. వైసీపీకి మూడు నెలల కిందటే 5వ నెంబర్ గది కేటాయించినా ఖాళీ చేయలేదని తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారాన్ని ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ వ్యవహారంపై ఆయన స్పందించారు.

    లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆదేశాలతో పార్లమెంట్‌ సిబ్బంది గ్రౌండ్ ఫ్లోర్‌లోని 5వ నెంబర్ గదికి టీడీపీ బోర్డును తొలగించి.. వైసీపీ ఆఫీసుగా మార్చారు. ఈ కార్యాలయానికి సమీపంలోని ప్రధాని మోదీ ఉండే పదో నెంబర్ గది, హోం మంత్రి అమిత్‌ షా కార్యాలయం కూడా ఉంది.
    Published by:Kishore Akkaladevi
    First published: