జగన్‌పై నిమ్మగడ్డ ప్రసాద్ అస్త్రాన్ని సంధిస్తున్న టీడీపీ...

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి కి చెక్ పెట్టేందుకు ప్ర‌తిప‌క్ష టీడీపీ అన్ని అస్త్ర‌ాల‌ను ప్ర‌యోగిస్తోంది.

news18-telugu
Updated: February 21, 2020, 4:08 PM IST
జగన్‌పై నిమ్మగడ్డ ప్రసాద్ అస్త్రాన్ని సంధిస్తున్న టీడీపీ...
నిమ్మగడ్డ ప్రసాద్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఎవ‌రు ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా త‌న‌దైన స్టైల్లో వ‌ర్క్ చేసుకుంటూ పోతున్న ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి కి చెక్ పెట్టేందుకు ప్ర‌తిప‌క్ష టీడీపీ అన్ని అస్త్ర‌ాల‌ను ప్ర‌యోగిస్తోంది. రాజ‌ధాని మార్పు అంశంలో తొలుత వ్య‌తిరేక‌త వ‌చ్చినా రానురాను అది ఓ ప్రాంతానికి సంబంధించిన నిర‌స‌న‌లు అని చెప్ప‌డంలో అధికార‌ పార్టీ స‌క్సెస్ అయింద‌నే చెప్పుకోవాలి. దీంతో పాటు ఒక సామాజిక వ‌ర్గం వాళ్లు మాత్ర‌మే చేస్తోన్న నిర‌స‌న‌లుగా ప్రొజ‌క్ట్ చేయడంలో వైసీపీ స‌క్సెస్ అయిందంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. ఈ నేప‌థ్యంలో అధికార‌పార్టీ దూకూడుకు క‌ళ్లెం వేయ‌డానికి చంద్రబాబు అండ్ టీం తాజాగా నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ వ్య‌వ‌హారాన్ని తెర‌పైకి తీసుకొచ్చింది. తాజాగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహన్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను ఒక అస్త్రంగా మ‌లుచుకున్న తెలుగు త‌మ్ముళ్లు... జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న వెనుక చీక‌టి ఒప్పందాలు, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ వ్య‌వ‌హారం కార‌ణ‌మ‌ని ఆరోపిస్తున్నారు.

ప్రధాని మోదీని కలిసిన సీఎం జగన్ (File)


జ‌గ‌న్ మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు వాన్ పిక్ పేరుతో యూఏఈ కి చెందిన ర‌స్ ఆల్ ఖైమా తో పోర్టులు, ఓడరేవుల అభివృద్దికి ఒప్పంద కుదుర్చుకున్నారు నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్. ఆ సమ‌యంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి దాదాపు 28 వేల ఎక‌రాల భూముల‌ను నిమ్మ‌గ‌డ్డ‌ కంపెనీకి కేటాయించారు. ర‌స్ ఆల్ ఖైమా దాదాపు 51 శాతం పెట్టుబ‌డులు కూడా పెట్టింది. అయితే ఆ పెట్టుబ‌డుల‌ను నిమ్మ‌గ‌డ్డ దుర్వినియోగం చేసి జ‌గ‌న్ కు సంబంధించిన జ‌గ‌తి పబ్లికేష‌న్స్ లో దాదాపు రూ.850 కోట్ల పెట్టుబ‌డులు పెట్టార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే ఈ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో గ‌త ఏడాది జూలైలో నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ ను సెర్బియాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నాయి. దానికి సంబంధించిన విచార‌ణ‌లో నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ జ‌గ‌న్‌కు చెందిన సంస్థ‌లో పెట్టుబ‌డుల‌కు సంబంధించిన స‌మ‌చారం అందించార‌ని అందులో భాగంగానే మ‌న‌దేశాన్ని సెర్బియా వివ‌ర‌ణ అడిగార‌ని, ఆ నేప‌థ్యంలోనే మోదీ జ‌గ‌న్ ను అత్య‌వ‌స‌రంగా పిలిపించుకొని మాట్లాడార‌ని టీడీపీ చేస్తోన్న ప్ర‌ధాన‌మైన ఆరోప‌ణ‌.

వైసీపీbjp ycp alliance,jagan amit shah meeting,bjp janasena alliance,jagan modi meeting,ycp joining nda,బీజేపీ వైసీపీ పొత్తు,కేంద్రంలో చేరున్న వైసీపీ,వైసీపికి రెండు కేంద్రమంత్రి పదవులు,బీజేపీ జనసేన పొత్తు,బీజేపీ వైసీపీ పొత్తుపై పవన్ కామెంట్స్,pawan kalyan on bjp ycp alliance,తో పొత్తు... క్లారిటీ ఇచ్చిన బీజేపీ | Bjp leader sunil deodhar clarifies on alliance with janasena and Amaravati ak
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ (File)
ఇందులో నిజానిజాలు ఎలా ఉన్న‌ప్పుటికి టీడీపీ మాత్రం ఈ అంశంలో చాలా దూకూడుగానే వెళ్తోంది. ఇప్ప‌టికే మండ‌లి ర‌ద్దు అంశాల్లో త‌మ‌కున్న శ‌క్తితో మెలిక పెట్టినా పెద్ద‌గా ఆ అంశంలో స‌క్సెస్ కాలేక‌పోయింది. ఎన్డీయే కూట‌మిలో వైసీపీ జాయిన్ అవడానికి ప్ర‌య‌త్నాలు చేస్తోన్న నేప‌థ్యంలో ఈ అంశాన్ని ఇప్పుడు తెర‌పైకి తీసుకొస్తే దాని ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని టీడీపీ భావిస్తోన్న‌ట్లు స‌మాచారం. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డి 9 నెలలు అయిన త‌రువాత బీజేపీ నుంచి ఎటువంటి అనుకూల సంకేతాలు లేకుండా ఎన్డీయే లో వైసీపీ చేర‌డంపై లీక్ లు ఎందుకొస్తాన్న‌యని టీడీపీ ప్ర‌ధానంగా ప్ర‌శ్నిస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌త్యేక హోదా అంశమే ప్ర‌ధాన ఎజెండా పెట్టుకొని ముందుకెళ్లిన వైసీపీ ఇప్పుడు హోదా గురించి కానీ, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ మోదీ నుంచి ఎటువంటి స్ప‌ష్ట‌త రాకుండా ఎన్డీయే లో ఎందుకు చేరుతున్నారో స్ప‌ష్ట‌త ప్ర‌జ‌ల‌కు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తోన్నారు తెలుగుత‌మ్ముళ్లు.

anna canteen, chandra babu, jagan, telugu varthalu, news updates, breaking news, telugu news, news today, daily news, news online, national news, india news, నేషనల్ న్యూస్, న్యూస్ అప్ డేట్స్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, న్యూస్ అప్ డేట్, బ్రేకింగ్ న్యూస్, వైరల్ న్యూస్, అన్నా క్యాంటీన్లు, చంద్రబాబు, జగన్,
చంద్రబాబు, జగన్


ఈ అంశంపై అధికార‌పార్టీ నేత‌లు అంత స్థాయిలో స్పందించ‌డం లేదు. ఎన్డీయే లో త‌మ పార్టీ చేరాలో లేదో అది పూర్తిగా అధినాయుకుడి నిర్ణ‌యం అని రాష్ట్రానికి ఎది మంచి చేస్తోందో అలాంటి నిర్ణ‌య‌మే జ‌గ‌న్ తీసుకుంటార‌ని అంటున్నారు. మొత్త‌ానికి నిమ్మ‌గడ్డ ప్ర‌సాద్ పేరుతో జ‌గ‌న్ పార్టీ పై ఒత్తిడి తీసుకురావ‌డానికి టీడీపీ చేస్తోన్న ప్ర‌య‌త్నాలు ఏ మేర‌కు స‌క్సెస్ అవుతాయో చూడాలి.(ఎం.బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు