Andhra Pradesh: నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు టీడీపీ పిలుపు..

ఆంధ్రప్రదేశ్‌లో నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీడీపీ పిలుపునిచ్చింది.

news18-telugu
Updated: July 6, 2020, 5:14 AM IST
Andhra Pradesh: నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు టీడీపీ పిలుపు..
చంద్రబాబు నాయుడు
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీడీపీ పిలుపునిచ్చింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు జూలై 6న గ్రామ/ మండల కేంద్రాలలో హౌసింగ్ పెండింగ్ బిల్లులు, ఇళ్లు స్వాధీనం చేయకపోవడంపై.. టీడీపీ హయాంలో నూతనంగా నిర్మించిన భవన సముదాయాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. టీడీపీ శ్రేణులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా ధరించి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆ పార్టీ పిలుపునిచ్చింది. అమరావతి ఆందోళనలు మొదలై 200 రోజులైన సందర్భంగా రాజధాని రైతులు నిర్వహించిన నిరసన కార్యక్రమానికి టీడీపీ మద్దతు పలికింది. రాష్ట్రం కోసం భూములు ఇచ్చిన రైతులు, మహిళలు, రైతుకూలీలకు అందరికీ చంద్రబాబు సంఘీభావం తెలిపారు. అమరావతి దేవేంద్రుడి రాజధాని అనీ... అటువంటి మహోన్నత చరిత్ర అమరావతికి ఉందనీ అన్నారు. అమరావతిని చంపాలని కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి విషయంలో జోక్యం చేసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 6, 2020, 5:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading